News November 19, 2025
అయినవిల్లి లంక: కుమారుని మృతదేహాన్ని దానం చేసిన తల్లి

సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో కుమారుని శరీరాన్ని వైద్య విద్యార్థులకు తల్లి దానం చేసిన ఘటన అయినవిల్లిలంకలో జరిగింది. 80 ఏళ్ల చిట్టూరి సీతారత్నం కుమారుడు అచ్యుత రామన్న చౌదరి (గోపి)(45) మరణించాడు దీంతో తల్లి కిమ్స్ వైద్య కళాశాలకు మృతదేహాన్ని అప్పగించారు. కిమ్స్ అనాటమీ విభాగాధిపతి నారాయణరావు మృతుని తల్లికి మంగళవారం అవయవదాన పత్రం అందజేశారు.
Similar News
News March 22, 2026
ఈపీడీసీఎల్‌లో భారీగా పెరిగిన విద్యుత్ లోడ్

ఏపీఈపీడీసీఎల్ పరిధిలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుతోంది. మార్చిలో రోజువారీ వినియోగం 96 మిలియన్ యూనిట్లకు చేరి సెంచరీకి దగ్గరైంది. గత ఏడాదితో పోలిస్తే సుమారు 10% పెరుగుదల నమోదైంది. ఎండల తీవ్రతతో ఏసీలు, కూలర్లు వినియోగం పెరగడం ప్రధాన కారణం. గ్యాస్ కొరతతో ఇండక్షన్ స్టౌవ్లు, ఎలక్ట్రిక్ పరికరాల వినియోగం కూడా అధికమైంది. పీక్ అవర్స్‌లో లోడ్ పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
News March 22, 2026
చిత్తూరు జిల్లా ప్రజలకు గమనిక

చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని పేర్కొన్నారు. సమస్యలపై meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. అదేవిధంగా డయల్ 1100 కు కాల్ చేసి తమ సమస్యలను నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
News March 22, 2026
PSL నుంచి IPLకు శనక

పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL) నుంచి శ్రీలంక T20 కెప్టెన్ దసున్ శనక తప్పుకోనున్నట్లు క్రీడావర్గాలు చెబుతున్నాయి. IPLలో RR తరఫున ఆయన ఆడే అవకాశముందని పేర్కొన్నాయి. గాయంతో దూరమైన సామ్ కరన్‌ను ఆయన రీప్లేస్ చేస్తారని సమాచారం. కాగా శనకను PSL వేలంలో లాహోర్ క్వాలెండర్స్ 2.2కోట్ల(PKR)కు కొనుగోలు చేసింది. ఇక ఆసీస్ ప్లేయర్ మాక్స్‌వెల్ సహా మరికొంతమంది ఆటగాళ్లు PSL నుంచి తప్పుకోనున్నట్లు వార్తలొస్తున్నాయి.


