News November 19, 2025

బాపుఘాట్ సుందరీకరణ.. DECలో ప్రారంభం!

image

HYD మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టులో భాగంగా గండిపేట నుంచి బాపూఘాట్ వరకు సరికొత్త నగరాన్ని అభివృద్ధి చేయనున్నారు. దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ ప్లానింగ్ జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ నుంచి బాపుఘాట్ వరకు మూసీ నది సుందరీకరణ పనులను చేపట్టాలని నిర్ణయించారు. డిసెంబర్లో పనులు ప్రారంభించాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

Similar News

News March 22, 2026

ఫిర్యాదులపై సత్వర పరిష్కారం: పెద్దపల్లి ఎస్ఈ

image

విద్యుత్ ప్రజావాణి కార్యక్రమం వినియోగదారుల సమస్యల పరిష్కారానికి సమర్థవంతమైన వేదికగా నిలుస్తోందని పెద్దపల్లి సర్కిల్ ఎస్ఈ వి.గంగాధర్ తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమంలో సర్కిల్, డివిజన్,సబ్-డివిజన్, సెక్షన్ స్థాయిలో ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. సమస్య తీవ్రతను బట్టి వెంటనే లేదా గడువులోపు పరిష్కారం అందిస్తామని,ఇప్పటివరకు 1021 సమస్యలు పరిష్కరించామన్నారు.

News March 22, 2026

రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం

image

TG: సిద్దిపేట పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా స్కీమ్ నిధులు విడుదల చేశారు. 70 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరేలా ₹3,600 కోట్లను బటన్ నొక్కి రిలీజ్ చేశారు. ఇవాళ బ్యాంకులకు సెలవు కావడంతో రేపు రైతుల అకౌంట్లలో డబ్బులు జమ కానున్నాయి. 45 రోజుల్లో 3 విడతల్లో రూ.9వేల కోట్లు అకౌంట్లలో జమ చేయనున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు.

News March 22, 2026

GK: ప్రపంచంలో అతి చిన్నవి

image

⋆ సముద్రం: ఆర్కిటిక్ (విస్తీర్ణం 14.05M చ.కి.మీ)
⋆ దేశం: వాటికన్ సిటీ (0.44 చ.కి.మీ వైశాల్యం)
⋆ ఖండం: ఆస్ట్రేలియా (7.7-8.6M చ.కి.మీ వైశాల్యం)
⋆ పక్షి: బీ హమ్మింగ్‌బర్డ్ (5-6cm పొడవు, 2gms కంటే తక్కువ బరువు)
⋆ నది: US మాంటానాలో ఉన్న’రో’ నది (పొడవు 61m)
⋆ అతి చిన్న పుష్పం గల చెట్టు: ఉల్ఫియా ఆంగుస్టా

➜ రోజూ సా.5 గంటలకు GK బిట్స్