News November 18, 2025
కరీంనగర్: కన్న కూతురిని చంపిన తండ్రి అరెస్ట్

KNR వావిలాలపల్లిలో కూతురిని హత్యచేసిన నిందితుడు మల్లేశంను KNR బస్టాండ్ వద్ద అరెస్టు చేసినట్లు 3టౌన్ CI జన్ రెడ్డి తెలిపారు. మానసిక, శారీరక వైకల్యం ఉన్న కూతురు హర్షిత, కొడుకు హర్షిత్‌ను మల్లేశం టవల్‌తో ఉరివేయగా కుమార్తె మృతి చెందింది. కాగా వీరిని ఆస్పత్రులలో చూపెట్టినా వ్యాధి తగ్గకపోవడంతో మానసిక వేదనతో హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని CI పేర్కొన్నారు. అతడిని రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.
Similar News
News November 18, 2025
MBNR: నవోదయ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల

బండమీదిపల్లి, వట్టెం జవహర్ నవోదయ విద్యాలయాలలో 6వ తరగతి ప్రవేశ పరీక్ష డిసెంబర్ 13న జరగనుంది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు హాల్‌టికెట్లను https://cbseitms.rcil.gov.in/nvs/AdminCard/AdminCard వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ జానకిరాములు తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ పరీక్షలను 29 కేంద్రాలలో నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

NLG: మహిళా సంఘాల పేరుతో రూ.1.50 కోట్లు స్వాహా

నల్గొండ పట్టణంలోని 3వ వార్డు పాతపల్లెకు చెందిన 12 సంఘాల పేరున ఆ గ్రామానికి చెందిన బుక్ కీపర్ ఒకరు బ్యాంకు ఫీల్డ్ అధికారులతో కలిసి కుమ్మక్కై కోటిన్నర రుణాలు తీసుకున్నారు. 4 నెలల నుంచి చెల్లింపులు ఆగడంతో బ్యాంకు సిబ్బంది బాధితుల దగ్గరికి వెళ్లగా.. తమకేం తెలవదని వారు ఆశ్చర్యానికి లోనయ్యారు. బుక్ కీపర్, బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బ్యాంకు ముందు నిరసన తెలిపారు.