News November 19, 2025

ఖమ్మం: మార్చురీలో శవాలపై కక్కుర్తి వసూళ్లు

image

శవాలపై పేలాలు ఏరుకోవడం అనే డైలాగ్ వినే ఉంటాం. ఇలాంటి ఘటనే ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీ సిబ్బంది వ్యవహారంతో స్పష్టంగా కనిపిస్తుంది. పోస్టుమార్టం పూర్తయ్యాక మృతదేహాన్ని అప్పగించేందుకు రూ.3-5 వేల వరకు డబ్బులు డిమాండ్‌ చేస్తున్నట్లు మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రికి ఏడాదికి 1000కి పైగా మృతదేహాలు వస్తున్న నేపథ్యంలో ఈ దందాపై వైద్య అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

Similar News

News March 18, 2026

ఖమ్మం: విద్యుత్ కనెక్షన్లు ఇక సులభం

image

కొత్త విద్యుత్ కనెక్షన్ల ప్రక్రియను సరళతరం చేస్తూ ఖమ్మం ఎస్ఈ శ్రీనివాసాచారి నూతన సర్వీస్ లైన్ ఛార్జీల విధానాన్ని ప్రకటించారు. ఇకపై క్షేత్రస్థాయి పరిశీలన అవసరం లేకుండా కేవలం లోడ్ ఆధారంగానే ఏకరీతి ఛార్జీలు వసూలు చేయనున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ ఖర్చును విద్యుత్ సంస్థే భరిస్తుందని, దీంతో వినియోగదారులపై అదనపు భారం ఉండదన్నారు. ఈ నూతన విధానంతో కనెక్షన్ల ప్రక్రియలో వేగం, పారదర్శకత పెరుగుతాయని తెలిపారు.

News March 18, 2026

MBNR: ‘తొలిసారిగా డిజిటల్‌లో జనాభా గణన’

image

జనాభా గణనను దేశంలో తొలిసారిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నారని కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. మొబైల్ యాప్‌లు, వెబ్ పోర్టల్‌లను ఉపయోగించి గణన ప్రక్రియను నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు తమ వివరాలను తామే స్వయంగా ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకునేందుకు ప్రత్యేక పోర్టల్‌ను ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. 2021లో నిర్వహించవలసిన ఈ ప్రక్రియ కోవిడ్ కారణంగా ఆలస్యం అయిందన్నారు.

News March 18, 2026

సంగారెడ్డి: 25లోగా ‘రైతు భరోసా’కు దరఖాస్తు చేసుకోండి

image

రైతు భరోసా పథకానికి అర్హులైన కొత్త రైతులు ఈనెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ సూచించారు. ఫిబ్రవరి 28 వరకు కొత్తగా పాస్ పుస్తకాలు పొందినా, గతంలో దరఖాస్తు చేసుకున్న వారు వివరాల్లో మార్పులు, చేర్పులకు అవకాశం ఉందని చెప్పారు. కావున రైతులు రైతు వేదికల్లోని మండల వ్యవసాయ అధికారులను సంప్రదించాలని కోరారు. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.