News April 13, 2024
దొంగలు పోయి గజదొంగలు వచ్చారు: కిషన్ రెడ్డి

TG: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో దొంగలు పోయి గజ దొంగలు వచ్చారన్నారు. సికింద్రాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం నుంచి రూ.వేల కోట్లు ఢిల్లీకి తరలిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఇచ్చిన గ్యారంటీలను పూర్తి చేయని రేవంత్ ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. మరోవైపు మోదీని మూడోసారి ప్రధానిని చేయాలని ప్రజలను కోరారు.
Similar News
News March 14, 2026
ASF: గుండెపోటుతో వార్డు మెంబర్ మృతి

కౌటాల మండలంలోని మొగడ్ దగడ్ గ్రామపంచాయతీ 4వ వార్డు సభ్యురాలు తారాబాయి(50) శుక్రవారం గుండెపోటుతో కన్నుమూశారు. కుటుంబీకుల కథనం ప్రకారం.. ఉదయం ఇంట్లో పని చేస్తుండగా ఆమెకు ఛాతీలో నొప్పి రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ప్రజా ప్రతినిధి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
News March 14, 2026
విశాఖలో మరో IT పార్క్.. 30వేల జాబ్స్!

AP: విశాఖ మధురవాడ(రుషికొండ) ఐటీ హిల్స్‌లో గ్రేడ్-1 ఐటీ పార్క్ రానుంది. విశాఖ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు హిల్-3 వెనుక ప్రభుత్వం 30 ఎకరాలు కేటాయించింది. ఈ కంపెనీ 3 దశల్లో రూ.2,200కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా, దాదాపు 30,000 మందికి ఉద్యోగావకాశాలు రానున్నట్లు సమాచారం. 30లక్షల చ.అ విస్తీర్ణంలో భవనాలు నిర్మించనున్నారు. ఇక అమరావతిలో రూ.300కోట్ల పెట్టుబడితో ‘జేవియర్’ క్యాంపస్ ఏర్పాటు కానుంది.
News March 14, 2026
అస్సాం కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్‌లో 150 ఉద్యోగాలు

అస్సాం కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ 150 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఏదైనా డిగ్రీ పూర్తి చేసి, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ సర్టిఫికెట్ కలిగి ఉండి, 21-38 ఏళ్ల మధ్య వయసు వారు అప్లై చేయొచ్చు. జీతం రూ.18,730- రూ.68,040 వరకు ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ MAR 20 నుంచి ప్రారంభం. చివరి తేదీ APR-19. రాత పరీక్ష, ఇంటర్వ్యూతో ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు acab.bank.in చూడండి.


