News November 18, 2025

అయిజ: డ్రైనేజీలో గుర్తు తెలియని మృతదేహం

image

అయిజ పట్టణంలో మంగళవారం ఉదయం డ్రైనేజీలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. అయిజ మున్సిపాలిటీ పరిధిలోని ఠాగూర్ స్కూల్ నుంచి మాధవ సినిమా టాకీస్ వైపు వెళ్లే రోడ్డు సమీపంలో ఉన్న డ్రైనేజీలో ఒక మగ మనిషి మృతదేహం పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 18, 2025

తెలంగాణలో అతిపెద్ద BESS సౌర ప్రాజెక్టు

image

TG: బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS)తో 1500 MW సౌర విద్యుత్ ప్లాంట్ రాష్ట్రంలో ఏర్పాటుకానుంది. కేంద్రం ఆమోదించిన అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది. మహేశ్వరం, చౌటుప్పల్ ప్రాంతాల్లో TGGENCO ఈ ప్లాంట్లను అభివృద్ధి చేస్తుంది. ఈమేరకు ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి GO విడుదల చేశారు. దీని ద్వారా అందే విద్యుత్ యూనిట్‌ ధర ₹2.90 మాత్రమే. ఇప్పటికే AP, గుజరాత్, ఛత్తీస్‌గఢ్ ఈ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నాయి.

ఉల్లాసంగా యూనిటీ ర్యాలీ.. పాల్గొన్న కేంద్రమంత్రి

image

ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకల సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో సర్దార్ @ 150యూనిటీ ర్యాలీ ఉల్లాసంగా సాగింది. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్, MLC అంజిరెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బీ గితే, వందలాది మంది యువత బతుకమ్మ ఘాట్ నుంచి కొత్తచెరువు వరకు నిర్వహించిన పాదయాత్రలో పాల్గొన్నారు. దేశ ఐక్యతకు పాటుపడతామని ఈ సందర్భంగా యువత ప్రముఖులతో ప్రతిజ్ఞ చేసింది.