News November 18, 2025

అయిజ: డ్రైనేజీలో గుర్తు తెలియని మృతదేహం

image

అయిజ పట్టణంలో మంగళవారం ఉదయం డ్రైనేజీలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. అయిజ మున్సిపాలిటీ పరిధిలోని ఠాగూర్ స్కూల్ నుంచి మాధవ సినిమా టాకీస్ వైపు వెళ్లే రోడ్డు సమీపంలో ఉన్న డ్రైనేజీలో ఒక మగ మనిషి మృతదేహం పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 18, 2025

కుటుంబ, వారసత్వ రాజకీయాలతో దేశానికి ముప్పు: బండి సంజయ్

image

కుటుంబ, వారసత్వ రాజకీయాలతో దేశానికి పెనుముప్పు పొంచి ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సర్దార్ @ 150 యూనిటీ మార్చ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశ రాజకీయాల్లో యువతను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. MLC అంజిరెడ్డి, ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ పాల్గొన్నారు.

హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం సహకరించాలి: సీఎం

image

ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారత దేశమని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్స్ రీజనల్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. వికసిత్ భారత్ 2047 అనుగుణంగా అప్పటికి 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా దేశాన్ని తీర్చిదిద్దాలని ప్రధాని మోదీ పనిచేస్తున్నారన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కేంద్ర మంత్రి ఖట్టర్‌ని కోరుతున్నామన్నారు.