News November 19, 2025

ఖమ్మం: చలా పంజా.. గజగజ వణుకుతున్న ప్రజలు

image

ఉమ్మడి జిల్లాలోని పల్లెలపై చలి పంజా విసురుతోంది. సాయంత్రం 6 గంటల నుంచే చలి తీవ్రత మొదలవుతుండటంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. రాత్రి నుంచి ఉదయం 10 గంటల వరకు చలి ప్రభావం ఎక్కువగా ఉంటోంది. దీంతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

Similar News

News March 10, 2026

కర్నూలులో KGBVలలో అడ్మిషన్లు ప్రారంభం

image

కేజీవీబీలో పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపీ సమగ్ర శిక్ష జిల్లా కోఆర్డినేటర్ లోకరాజు తెలిపారు. జిల్లాలోని 26 పాఠశాలల్లో ప్రతి తరగతికి 40 సీట్లు ఉండగా, ఇతర తరగతుల్లో ఖాళీలను కూడా భర్తీ చేస్తారు. SC, ST, BC, మైనారిటీ, BPL, అనాథలు, డ్రాప్‌అవుట్ బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు అని ఏప్రిల్ 1 చివరి తేది అన్నారు.

News March 10, 2026

కడప జిల్లాలో ఒక్కరోజే 273 కేసులు.!

image

కడప జిల్లా వ్యాప్తంగా సోమవారం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై పోలీసులు తనిఖీలు చేపట్టి 273 కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా రూ.64,710లు జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఎస్పీ నచికేత్ మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కార్లలో వెళ్లేవారు సీట్ బెల్ట్ ధరించాలన్నారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News March 10, 2026

సల్మాన్ మూవీలో హీరోయిన్‌గా సమంత?

image

సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కబోయే సూపర్ హీరో ఫిల్మ్‌లో సమంత హీరోయిన్‌గా నటించే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. రాజ్&డీకే ద్వయం ఈ మూవీని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో హ్యూమర్+యాక్షన్ ఉంటుందని సమాచారం. కాగా డైరెక్టర్ల ద్వయంలో ఒకరైన రాజ్‌‌ను సామ్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ‘మా ఇంటి బంగారం’ సినిమాతో పాటు ‘రక్త బ్రహ్మాండ్’ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు.