News November 19, 2025
నల్గొండ: నేటి నుంచి మళ్లీ పత్తి కొనుగోలు షురూ

జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు బందును విరమించాయి. సీసీఐ నిబంధనలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న జిన్నింగ్ మిల్లులు మంగళవారం బంద్ పాటించాయి. దీంతో రంగంలోకి దిగిన సీసీఐ సీఎండీ జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ నేతలతో భేటీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మిల్లులను 2, 3 రోజుల్లో తెరుస్తామని హామీ ఇవ్వడంతో మిల్లుల యజమానులు బంద్ ఉపసంహరించుకున్నారు. నేటి నుంచి మళ్లీ పత్తి కొనుగోళ్లు చేయనున్నారు.
Similar News
News March 14, 2026
KNR: ఈనెల 17న ఇంటర్వ్యూ.. ఆర్టీసీ KNR RM

ఆర్టీసీ KNR రీజియన్‌లోని టెక్నికల్, నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్లు, డిప్లొమా అప్రెంటిషిప్‌కు FEB 24, 2026 వరకు వెబ్‌సైట్‌లో నమోదు చేసుకున్న అభ్యర్థులకు మెరిట్ ఆధారంగా మార్చి 17న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ KNR RM బి.రాజు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు కరీంనగర్ ఆర్టీసీ కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీ, 2 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో హాజరుకావాలన్నారు.
News March 14, 2026
వనపర్తి జిల్లాలో భానుడి భగభగ.. 39.3°C నమోదు

వనపర్తి జిల్లాలో ఎండలు ముదురుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా కానాయిపల్లిలో 39.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వీపనగండ్ల, దగడలో 39.0°, గోపాల్‌పేటలో 38.9°గా నమోదయ్యాయి. జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో 38 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
News March 14, 2026
హార్ముజ్ దాటిన భారత నౌకలు.. మొత్తం 86వేల టన్నుల LPG

భారత్‌కు చెందిన మరో LPG క్యారియర్ హార్ముజ్ జలసంధిని దాటినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 46వేల మెట్రిక్ టన్నుల LPGతో ‘నందా దేవి’ అనే నౌక వస్తోందని, దీనికి ఇండియన్ నేవీ ఎస్కార్ట్ కల్పిస్తోందని పేర్కొన్నాయి. మరో రెండు రోజుల్లో ముంబై లేదా కాండ్లా(గుజరాత్) ఓడరేవుకు చేరుకోనుంది. మరో షిప్ ‘శివాలిక్’ నిన్నే హార్ముజ్‌ను దాటిందని, అందులో 40వేల టన్నుల LPG ఉందని CNN NEWS 18 తెలిపింది.


