News November 19, 2025

ఆన్‌లైన్‌లో అమ్మాయిలపై వేధింపుల్లో HYD ఫస్ట్!

image

నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం ఆన్‌లైన్‌లో చిన్నారులు, మహిళలపై జరుగుతున్న వేధింపుల్లో దేశంలోనే HYD నం.1గా నిలిచింది. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఇలాంటి ఘటనలు హైదరాబాద్‌లో ఎక్కువగా నమోదయ్యాయి. ఆన్‌లైన్‌లో అసభ్య మెసేజ్‌లు పంపడం, మార్ఫింగ్ ఫొటోలు పంపించడం, అమ్మాయికి నచ్చకపోయినా వరుసగా మెసేజ్‌లు పంపుతూ ఇబ్బంది పెట్టడం వంటి వేధింపులు ప్రధానంగా కనిపిస్తున్నాయని నివేదికలో వెల్లడైంది.

Similar News

News March 24, 2026

72 గంటల ముందుగా టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే ఫుల్ రిఫండ్

image

టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీల్లో రైల్వే శాఖ కీలక మార్పులు చేసింది. ఇకపై 72 గంటల ముందుగా టికెట్‌ను రద్దు చేసుకుంటే పూర్తి మొత్తం(నామమాత్రపు ఫ్లాట్ క్యాన్సిలేషన్ ఛార్జీ కట్ అవుతుంది) తిరిగి ఇవ్వనుంది. 72 నుంచి 24 గంటల్లోపు అయితే 25 శాతం, 24 గంటల నుంచి 8 గంటల్లోపు అయితే 50 శాతం కట్ చేయనుంది. 8 గంటల్లోపు అయితే ఎలాంటి రిఫండ్ ఉండదు. ఏప్రిల్ 1 నుంచి 15 మధ్యలో ఈ రూల్స్‌ను అమల్లోకి తేనుంది.

News March 24, 2026

సేద్యంపై ‘శాపం’.. ఎండిపోతున్న పైర్లు

image

నల్గొండ జిల్లాలో సాగునీరు అందక పంట పొలాలు కళ్లముందే ఎండిపోతుండటంతో రైతులు అల్లాడిపోతున్నారు. మునుగోడు మండలం ఉకోండిలో భూగర్భ జలాలు అడుగంటి, బోర్లు పోయక పరిస్థితి దారుణంగా మారింది. చేతికొచ్చే దశలో వరి, ఇతర పంటలు ఎండుతుండటంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టిన పెట్టుబడి దక్కేలా లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వం స్పందించి సాగునీటి ఇబ్బందులను తొలగించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

News March 24, 2026

సంచలనం.. యుద్ధంలోకి సౌదీ, UAE?

image

పశ్చిమాసియాలో యుద్ధం విస్తరించే అవకాశం కనిపిస్తోంది. ఇరాన్‌పై అమెరికా చేస్తోన్న దాడుల్లో సౌదీ, UAE పాల్గొనేందుకు సిద్ధమైనట్లు ‘వాల్‌స్ట్రీట్ జనరల్’ వెల్లడించింది. తమ వైమానిక స్థావరాలను US వాడుకొనేందుకు సౌదీ ఓకే చెప్పినట్లు తెలిపింది. తమ దేశంలోని టెహ్రాన్‌కు చెందిన ఆస్పత్రి, క్లబ్‌ను UAE మూసేసినట్లు పేర్కొంది. తమ రిఫైనరీలపై ఇరాన్ దాడులను ఉపేక్షించబోమని ఇటీవల గల్ఫ్ దేశాలు ప్రకటించడం తెలిసిందే.