News November 19, 2025

మర్రిపాడు: నవోదయ విద్యార్థిని ఆత్మహత్య..UPDATE

image

మర్రిపాడు మండలం, కృష్ణాపురం నవోదయ విద్యాలయంలో దారుణం చోటు చేసుకుంది.10వ తరగతి చదువుతున్న ప్రణీత (14) అనే విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అర్ధరాత్రి 2 సమయంలో మెట్ల కమ్ములకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న బాలికను చూసి ఆయమ్మ ప్రిన్సిపల్‌కి సమాచారం ఇచ్చింది. బాలిక ప్రణీత కావలి రూరల్ అడవిరాజుపాలెం గ్రామం. బాలిక తండ్రి కొండాపురం ఎంఈఓగా పనిచేస్తున్నారు.

Similar News

News March 19, 2026

ట్రెడిషనల్ లుక్‌లో నెల్లూరు కలెక్టర్

image

నెల్లూరు కలెక్టరేట్‌లో తెలుగుదనం ఉట్టిపడేలా ఉగాది సంబరాలు ప్రారంభం అయ్యాయి. ఉగాది వేడుకలను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ వేడుకల్లో కవులు, కళాకారులు, అధికారులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పండితులు పంచాంగ శ్రవణం చదువుతున్నారు. కలెక్టర్ ట్రెడిషనల్ లుక్ అందరిని ఆకట్టుకుంది.

News March 19, 2026

నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్న మాజీ MLA

image

నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాచర్ల మాజీ MLA పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విడుదల కానున్నారు. TDP నేతల జంట హత్యల కేసులో పిన్నెల్లితో పాటు ఆయన సోదరుడు 98 రోజుల నుంచి జైలులో ఉన్నారు. గురజాల కోర్టు బెయిల్ ఇవ్వడంతోఆయన ఇవాళ విడుదల కానున్నారు. ఇప్పటికే బెయిల్ పేపర్స్‌ను జైలు అధికారులకు అందజేశారు.

News March 19, 2026

ఎండలు.. నెల్లూరు కలెక్టర్ కీలక ఆదేశాలు

image

నెల్లూరు జిల్లాలో ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు వడదెబ్బకు గురికాకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు, పాఠశాలల్లో వాటర్ బెల్, ఉపాధి పనుల సమయం తగ్గింపుతో పాటు ఆసుపత్రుల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో మజ్జిగ పంపిణీ చేయాలని సూచించారు.