News November 19, 2025
మద్యం తాగాలంటూ ఏయూ హాస్టల్లో బెదిరింపులు

దేశంలోనే ప్రఖ్యాతి చెందిన ఏయూ పరువు రోజు రోజుకూ దిగజారుతోందని పలువురు ఆవేదన చెందుతున్నారు. ఏయూలో నిన్న జరిగిన ఓ కార్యక్రమానికి కలెక్టర్ హరేంధిర ప్రసాద్, CP శంఖబ్రత బాగ్చీ వచ్చారు. ఈ క్రమంలో ఓ విదేశీ విద్యార్థి వారి వద్దకు వెళ్లి తమ హాస్టల్లో కొంతమంది విద్యార్థులు మద్యం తాగాలంటూ బలవంతం చేస్తున్నారని ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని కమిటీ వేసి చర్యలు తీసుకుంటామని VC రాజశేఖర్ తెలిపారు.
Similar News
News April 1, 2026
భారీగా పెరిగిన బంగారం ధర.. కారణం ఇదే

పశ్చిమాసియాలో ఘర్షణలు తగ్గొచ్చనే అంచనాలు, బ్యాంకులు వడ్డీ రేట్లను సవరించవనే నమ్మకంతో బంగారం, వెండికి డిమాండ్ పెరిగింది. దీంతో మళ్లీ ధరలు పెరుగుతున్నాయి. ఇవాళ రెండుసార్లు రేట్లు ఎగిశాయి. HYD బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ఏకంగా ₹3,440 పెరిగి ₹1,52,950 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹3,150 పెరిగి ₹1,40,200కు చేరింది. ఇక కేజీ వెండి ధర ₹2,65,000గా ఉంది.
News April 1, 2026
సిరిసిల్ల: వేసవిలో తీసుకోవలసిన జాగ్రత్తలపై సమీక్షా సమావేశం

వేసవి వడగాల్పుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య ఆరోగ్యశాఖ, అగ్నిమాపకశాఖ, అటవీశాఖ, కార్మిక శాఖ, వ్యవసాయ శాఖ, వివిధ శాఖల ఆద్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్, జిల్లా అటవీ శాఖ అధికారి బాలమణి, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి బుధవారం సమీక్ష నిర్వహించారు. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్లను కలెక్టర్ అధికారులతో ఆవిష్కరించారు.
News April 1, 2026
KGVBలో ఖాళీలు.. ఈ గుడ్ న్యూస్ మీకోసమే..!

కేజీబీవీల్లో 2026-27 విద్యా సంవత్సరం ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువును పెంచినట్లు జిల్లా ప్రాజెక్ట్ అధికారి అనిల్ కుమార్ తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. ప్రకాశంలో 1445, మార్కాపురంలో 1815 ఖాళీలు ఉన్నాయన్నారు. దరఖాస్తులను సంబంధిత వెబ్సైట్ ద్వారా సమర్పించాలని కోరారు. గడువు ఏప్రిల్ 10 వరకు ఉందన్నారు. ఈ విషయాన్ని గమనించాలని కోరారు.


