News November 18, 2025

ఎన్టీఆర్ జిల్లాలో భారీగా పంట నష్టం

image

మొంథా తుఫాను ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లాలో ఉద్యాన, వ్యవసాయ పంటలకు భారీ నష్టం వాటిల్లింది. 162 ఎకరాల్లో అరటి, కూరగాయలు, 2,360 ఎకరాలకు పైగా వరి, పత్తి దెబ్బతిన్నాయి. పంట నష్టంగా రైతులకు మొత్తం రూ.12.38 కోట్లు పరిహారం అందజేయాలని కోరుతూ సంబంధిత అధికారులు ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు.

Similar News

News November 18, 2025

విశాఖ: బాలోత్సవం-2025 పోస్టర్ ఆవిష్కరణ

image

ఆనందపురం‌లో డిసెంబర్ 9–11వ తేదీల్లో సెయింట్ ఆంథోనీ పాఠశాలలో జరగనున్న 3వ మహా విశాఖ బాలోత్సవం-2025 పోస్టర్‌ను DEO ఎన్.ప్రేమకుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బాలోత్సవం నిర్వాహకులు, సేవా సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. గత సంవత్సరం 8,000 కంటే ఎక్కువ మంది పిల్లలు పాల్గొన్న నేపథ్యంలో ఈసారి మరింత విస్తృతంగా నిర్వహించేందుకు విద్యాశాఖ పూర్తి సహకారం ప్రకటించింది.

పోచంపల్లిలో ఉచిత శిక్షణ.. దరఖాస్తులకు ఆహ్వానం

image

యాదాద్రి: నిరుద్యోగ యువతకు పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉచిత సాంకేతిక శిక్షణ అందిస్తున్నట్లు శ్రీ రామానందతీర్థ గ్రామీణ సంస్థ ఛైర్మన్ కిషోర్ రెడ్డి తెలిపారు. 3 నెలల డీటీపీ, ఇంటీరియర్ డిజైనింగ్, 6 నెలల ఎలక్ట్రికల్ & సోలార్, మొబైల్ రిపేర్ వంటి కోర్సులు ఉన్నాయన్నారు. 8వ తరగతి నుంచి అర్హులని, ఈ నెల 20లోపు దరఖాస్తు చేసుకోవాలని, ఉచిత భోజనం, హాస్టల్ వసతి కలదని ఆయన పేర్కొన్నారు.