News April 13, 2024
UPDATE: బెట్టింగ్‌కు బానిసై అప్పు.. సూసైడ్

అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలోని ఓ లాడ్జిలో యువకుడు ఉరేసుకొని సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. కరప మండలం వేళంగికి చెందిన అనిల్‌కుమార్(25) క్రికెట్ బెట్టింగ్‌కు అలవాటయ్యాడు . దానికి తోడు చెడు వ్యసనాలకు బానిస కావడం, బెట్టింగ్ కారణంగా అప్పులు ఎక్కువ కావడంతో ఆ ఒత్తిడి తట్టుకోలేకపోయాడు. శుక్రవారం లాడ్జిలో రూం తీసుకున్న అనిల్.. ఆత్మహత్య చేసుకున్నట్లు SI తెలిపారు.
Similar News
News March 7, 2026
తూ.గో: స్టూడెంట్స్‌తో మీనాక్షి చౌదరి డాన్స్

గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ లో జరుగుతున్న మైత్రి యువజనోత్సవాలలో శుక్రవారం రాత్రి నటి మీనాక్షి చౌదరి సందడి చేశారు. విద్యార్థులతో కలిసి పాటలు పాడి డాన్స్ చేశారు. తాను దంతవైద్యం చదివి నటినయ్యానని.. విద్యార్థుల ఆనందం చూస్తుంటే తన చదువుకునే రోజులు గుర్తొస్తున్నాయని పేర్కొన్నారు. అనంతరం మీనాక్షిని చాన్స్‌లర్ చైతన్య రాజు సత్కరించారు. భవిష్యత్తులో మీలోనే ఎందరో నటీనటులు రావచ్చని ఆమె ఆకాంక్షించారు.
News March 7, 2026
రాజమండ్రి: వాట్సాప్ ద్వారా టెన్త్ హాల్ టికెట్ పొందండిలా!

టెన్త్ పరీక్షలకు వెళ్లే విద్యార్థుల సౌకర్యార్ధం వాట్సాప్ గవర్నెన్స్ సేవల ద్వారా హాల్ టికెట్లు పొందే అవకాశం ప్రభుత్వం కల్పించినట్లు డీఈవో వాసుదేవరావు తెలిపారు. దీని కోసం 95523 00009 నంబర్ కు “Hi” అని మెసేజ్ పంపాలన్నారు. తదుపరి అందుబాటులో వచ్చే సేవల్లో “విద్యా సేవలు” ఎంపిక చేసి “SSC Hall Ticket” పై క్లిక్ చేయాలి. తర్వాత విద్యార్థి అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేస్తే డౌన్‌లోడ్ అవుతుందన్నారు.
News March 7, 2026
పది పరీక్షలకు సర్వం సిద్ధం: కలెక్టర్ కీర్తి చేకూరి

మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని తహశీల్దార్లను ఆదేశించారు. ప్రశ్నపత్రాల భద్రతకు స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద 24 గంటల పోలీసు పహారా, రవాణాకు ఎస్కార్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్రాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం మెరుగుపరచాలన్నారు.


