News November 19, 2025
మద్యం తాగాలంటూ ఏయూ హాస్టల్లో బెదిరింపులు

దేశంలోనే ప్రఖ్యాతి చెందిన ఏయూ పరువు రోజు రోజుకూ దిగజారుతోందని పలువురు ఆవేదన చెందుతున్నారు. ఏయూలో నిన్న జరిగిన ఓ కార్యక్రమానికి కలెక్టర్ హరేంధిర ప్రసాద్, CP శంఖబ్రత బాగ్చీ వచ్చారు. ఈ క్రమంలో ఓ విదేశీ విద్యార్థి వారి వద్దకు వెళ్లి తమ హాస్టల్లో కొంతమంది విద్యార్థులు మద్యం తాగాలంటూ బలవంతం చేస్తున్నారని ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని కమిటీ వేసి చర్యలు తీసుకుంటామని VC రాజశేఖర్ తెలిపారు.
Similar News
News March 14, 2026
ADB: వంటింట్లో యుద్ధ సెగలు

చమురు, గ్యాస్ ధరల సెగ వంటింటిపై పడుతోంది. వినియోగదారులు ముందస్తు బుకింగ్‌లు చేయడంతో కృత్రిమ కొరత ఏర్పడింది. అధికారికంగా రూ.60 పెరిగి సిలిండర్ ధర రూ.920 కాగా, బ్లాక్ మార్కెట్లో రూ.1100 వరకు ఉంది. ADBలో 282.2, ASFలో 190.0, MNCLలో 345.2, నిర్మల్‌లో 269.3 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. ఇదే అదునుగా వ్యాపారులు సిలిండర్‌పై రూ.150 నుంచి రూ.200 వరకు అదనంగా దండుకుంటున్నారని వినియోగదారులు వాపోతున్నారు.
News March 14, 2026
9వ తరగతి నుంచే ‘పదో తరగతి’కి సన్నద్ధం: కలెక్టర్

వచ్చే విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫలితాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు కలెక్టర్ బాలాజీ వినూత్న కార్యాచరణ ప్రకటించారు. ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఇప్పుడే 10వ తరగతి సిలబస్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. 2027 SSC పరీక్షల కోసం వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో విద్యార్థులను తీర్చిదిద్దాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
News March 14, 2026
1,462 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశాం: శ్రీకాకుళం కలెక్టర్

జిల్లాలో ప్రాథమిక స్థాయి అక్షరాస్యత పరీక్షలు 1,13,102 మంది మార్చి 15వ తేదీన రాయనున్నారని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులు సమన్వయంతో పరీక్షలు విజయవంతంగా నిర్వహించాలన్నారు. అభ్యాసకులకు అన్ని మండల, మున్సిపాలిటీ, గ్రామ వార్డుల పరిధిలో ఉన్న ప్రభుత్వ ఎలిమెంటరీ స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో 1,462 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.


