News November 18, 2025
అద్దె చెల్లించలేదని MRO కార్యాలయానికి తాళం

యాదాద్రి: నూతనంగా ఏర్పడిన అడ్డగూడూర్ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయానికి దాదాపు రెండేళ్లుగా అద్దె చెల్లించడం లేదని భవన యజమాని తాళం వేశాడు. సొంత భవనం లేక నెలకు రూ.12,600 అద్దె చెల్లిస్తున్న ఈ కార్యాలయానికి, సుమారు రూ.2.13 లక్షలు బకాయి పడ్డారని యజమాని తెలిపారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌కు నివేదిక పంపినట్లు, బకాయి బిల్లు చెల్లించాల్సి ఉందని MRO శేషగిరిరావు తెలిపారు.
Similar News
News November 18, 2025
విశాఖ: బాలోత్సవం-2025 పోస్టర్ ఆవిష్కరణ

ఆనందపురంలో డిసెంబర్ 9–11వ తేదీల్లో సెయింట్ ఆంథోనీ పాఠశాలలో జరగనున్న 3వ మహా విశాఖ బాలోత్సవం-2025 పోస్టర్‌ను DEO ఎన్.ప్రేమకుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బాలోత్సవం నిర్వాహకులు, సేవా సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. గత సంవత్సరం 8,000 కంటే ఎక్కువ మంది పిల్లలు పాల్గొన్న నేపథ్యంలో ఈసారి మరింత విస్తృతంగా నిర్వహించేందుకు విద్యాశాఖ పూర్తి సహకారం ప్రకటించింది.

పోచంపల్లిలో ఉచిత శిక్షణ.. దరఖాస్తులకు ఆహ్వానం

యాదాద్రి: నిరుద్యోగ యువతకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉచిత సాంకేతిక శిక్షణ అందిస్తున్నట్లు శ్రీ రామానందతీర్థ గ్రామీణ సంస్థ ఛైర్మన్ కిషోర్ రెడ్డి తెలిపారు. 3 నెలల డీటీపీ, ఇంటీరియర్ డిజైనింగ్, 6 నెలల ఎలక్ట్రికల్ & సోలార్, మొబైల్ రిపేర్ వంటి కోర్సులు ఉన్నాయన్నారు. 8వ తరగతి నుంచి అర్హులని, ఈ నెల 20లోపు దరఖాస్తు చేసుకోవాలని, ఉచిత భోజనం, హాస్టల్ వసతి కలదని ఆయన పేర్కొన్నారు.