News April 13, 2024
ఎన్నికల శిక్షణ తరగతులు పరిశీలించిన కలెక్టర్

కందుకూరు నియోజకవర్గం జాతీయ రహదారి తేట్టు వద్ద స్టాటికల్ సర్వేలెన్స్ టీం చెక్‌పోస్ట్‌ను కలెక్టర్ ఎం హరి నారాయణన్ పరిశీలించారు. కందుకూరు నియోజక వర్గంలోని టి.ఆర్.ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో పిఓలకు , ఏపిఓలకు నిర్వహిస్తున్న ఎన్నికల శిక్షణ తరగతులు పరిశీలించారు. అనంతరం కావలి నియోజకవర్గం జాతీయ రహదారి రుద్రకోట స్టాటికల్ సర్వేలెన్స్ టీం చెక్ పోస్ట్ ను తనిఖీ చేశారు.
Similar News
News March 18, 2026
నెల్లూరు: ముగిసిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు

ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు మంగళవారంతో ముగిసినట్లు RIO వరప్రసాద్ తెలిపారు. జిల్లాలో మొదటి సంవత్సరంలో 23,334 మంది విద్యార్థులకుగానూ 22,843 మంది హాజరయ్యారన్నారు. జిల్లాలో జరిగిన మొదటి సంవత్సరం ఇంటర్ పరీక్షల్లో ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా చర్యలు చేపట్టడం వల్ల ప్రశాంతంగా ముగిశాయన్నారు. నేడు ద్వితీయ సంవత్సరం ప్రధాన పరీక్షలు కూడా ముగియనున్నట్లు ఆయన తెలిపారు.
News March 18, 2026
నెల్లూరు: నిధుల గోల్‌మాల్.. ముగ్గురిపై వేటు

సామాజిక పింఛన్ల నగదు, మండల పరిషత్ సాధారణ నిధులను స్వాహా చేశారన్న ఆరోపణలపై MPDO, AO, జూనియర్ అసిస్టెంట్లను సర్వీస్ నుంచి శాశ్వతంగా తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోట మండలంలో MPDOగా పనిచేసిన బ్రహ్మయ్య, AO కౌసల్య, జూనియర్ అసిస్టెంట్ అబూబకర్ సిద్ధిఖ్ పింఛన్లు, మండల పరిషత్‌లో దాదాపు రూ.53లక్షల వరకు నిధులు స్వాహా చేసినట్లు ఆరోపణలొచ్చాయి. విచారణ అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
News March 18, 2026
కోవూరు: ఇల్లా.. నందనవనమా..?

కోవూరు మండలం పాటూరులో ఓ వ్యక్తి తన ఇంటిని పూల చెట్లతో నందనవనంలా మార్చాడు. తన మూడు అంతస్తుల ఇంటిని ఒక్కొక్క అంతస్తుకి ఒక అరలాగా కనిపించేలా కాగితాల పూల చెట్లను అల్లించాడు. దీంతో వేసవి కాలంలో ఆ ఇంట్లో చల్లదనం తోపాటు స్వచ్ఛమైన గాలి అందుతోంది. ఈ రంగు రంగుల కాగితాల పూలతో ఆ ఇల్లు అటుగా వెళ్లే వాహనదారులు, ప్రజలను ఆకట్టుకుంటోంది.


