News November 18, 2025
రైల్వేకోడూరు: దేవుడా.. ఏంటి ఈ ఘోరం!

రైల్వేకోడూరు మండలం కొండారెడ్డిపోడుకు చెందిన విజయ్ HYDలోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పనిచేస్తున్నాడు. 8ఏళ్ల కిందట వివాహమైంది. IVF ద్వారా అతని భార్య శ్రావ్య గర్భం దాల్చింది. ఆమెకు ఆదివారం కడుపులో నొప్పి రావడంతో ఆసుపత్రికి వెళ్లారు. చికిత్స చేస్తుండగా గర్భంలోని కవల పిల్లలతో సహా భార్య చనిపోయింది. ఇది తట్టుకోలేని విజయ్ ఇంటికెళ్లి ఉరేసుకుని చనిపోయాడు. నేటి రాత్రికి మృతదేహాలు గ్రామానికి రానున్నాయి.
Similar News
News November 18, 2025
విశాఖ: బాలోత్సవం-2025 పోస్టర్ ఆవిష్కరణ

ఆనందపురంలో డిసెంబర్ 9–11వ తేదీల్లో సెయింట్ ఆంథోనీ పాఠశాలలో జరగనున్న 3వ మహా విశాఖ బాలోత్సవం-2025 పోస్టర్‌ను DEO ఎన్.ప్రేమకుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బాలోత్సవం నిర్వాహకులు, సేవా సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. గత సంవత్సరం 8,000 కంటే ఎక్కువ మంది పిల్లలు పాల్గొన్న నేపథ్యంలో ఈసారి మరింత విస్తృతంగా నిర్వహించేందుకు విద్యాశాఖ పూర్తి సహకారం ప్రకటించింది.

పోచంపల్లిలో ఉచిత శిక్షణ.. దరఖాస్తులకు ఆహ్వానం

యాదాద్రి: నిరుద్యోగ యువతకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉచిత సాంకేతిక శిక్షణ అందిస్తున్నట్లు శ్రీ రామానందతీర్థ గ్రామీణ సంస్థ ఛైర్మన్ కిషోర్ రెడ్డి తెలిపారు. 3 నెలల డీటీపీ, ఇంటీరియర్ డిజైనింగ్, 6 నెలల ఎలక్ట్రికల్ & సోలార్, మొబైల్ రిపేర్ వంటి కోర్సులు ఉన్నాయన్నారు. 8వ తరగతి నుంచి అర్హులని, ఈ నెల 20లోపు దరఖాస్తు చేసుకోవాలని, ఉచిత భోజనం, హాస్టల్ వసతి కలదని ఆయన పేర్కొన్నారు.