News November 19, 2025
వంటింటి చిట్కాలు

* ఫ్లాస్క్‌ని ఎంత శుభ్రం చేసినా దుర్వాసన వస్తుంటే మజ్జిగతో కడగాలి.
* అల్లం, వెల్లుల్లిని రుబ్బేటప్పుడు కొద్దిగా వేయిస్తే ఆ మిశ్రమం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
* వంకాయ కూర వండేటప్పుడు నిమ్మరసం పిండితే కూర రంగు మారదు. రుచి కూడా పెరుగుతుంది.
* కారం డబ్బాలో ఇంగువ వేస్తే పురుగులు పట్టవు.
* పుదీనా, కొత్తమీర చట్నీ చేసేటప్పుడు పెరుగు వేస్తే రుచి పెరుగుతుంది.
Similar News
News April 5, 2026
భద్రాచలం పక్కనున్న 5 గ్రామాలను TGలో కలపండి: తుమ్మల

భద్రాచలం పక్కన ఉన్న 5 గ్రామాలను ఏపీ నుంచి తెలంగాణలో కలపాలని కేంద్రాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కోరారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ‘పాలనా సౌలభ్యం కోసం పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల, ఎటపాక, కన్నాయిగూడెం గ్రామాలను తిరిగి తెలంగాణలో చేర్చండి. అలాగైతేనే గిరిజనుల సమస్యలు తొలగిపోతాయి. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే విలీనం బిల్లు పెట్టేలా చూడండి’ అని కోరారు.
News April 5, 2026
‘ధురంధర్’ తెర వెనుక హీరోలకు థాంక్స్: సారా అర్జున్

ధురంధర్ 2 భాగాలు సూపర్ హిట్ కావడంలో కీలక పాత్ర పోషించిన టెక్నీషియన్స్‌కు హీరోయిన్ సారా అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు. ‘ఆదిత్య ధర్‌ను తొలిసారి చూసినప్పుడే ప్రత్యేకంగా ఏదో చేస్తారనుకున్నా. ఆయనతోపాటు దర్శకత్వ బృందం ఎంతో కృషి చేసింది. నిర్మాతలు, DOP, క్యాస్టింగ్ డైరెక్టర్.. ఇంకా ఎంతో మంది ఈ మూవీకి వెన్నెముకలా తెర వెనుక చెమటోడ్చారు. మీ అందరికీ థాంక్స్. చరిత్ర సృష్టించాం’ అని ఇన్‌స్టాలో పేర్కొన్నారు.
News April 5, 2026
PHOTO GALLERY: ఉప్పల్‌లో SRH మ్యాచ్

IPL: ఉప్పల్ స్టేడియంలో జరిగిన SRH, LSG మ్యాచుకు భారీ సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు. దాదాపు 39వేల మంది వచ్చినట్లు సమాచారం. టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ సైతం స్టేడియానికి వచ్చి ప్లేయర్లను ఎంకరేజ్ చేశారు. చేతిలో ఆరెంజ్ జెండా పట్టుకొని ఉత్తేజపరిచారు. SRH ఓనర్ కావ్య, లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా, ఇషాన్ కిషన్ ప్రేయసి అదితి హుండియా, బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్, నిర్మాత సురేశ్ బాబు సందడి చేశారు.


