News November 19, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మం, మధిర నియోజకవర్గాల్లో మంత్రి తుమ్మల పర్యటన
∆} పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష
∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} ఖమ్మం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} కూసుమంచిలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
∆} నేటి నుంచి పత్తి కొనుగోలు పునఃప్రారంభం

Similar News

News April 2, 2026

జిల్లాలో ప్రశాంతంగా పదో తరగతి పరీక్ష.. 99.88% హాజరు!

image

ఖమ్మం జిల్లావ్యాప్తంగా గురువారం జరిగిన పదవ తరగతి భౌతిక రసాయన శాస్త్రం పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 16,975 మంది విద్యార్థులకు గానూ 16,954 మంది హాజరయ్యారని, 21 మంది గైర్హాజరైనట్లు డీఈఓ చైతన్య జైనీ తెలిపారు. డీఈవో చైతన్య జైని 2 కేంద్రాలను, డిస్ట్రిక్ట్ లెవల్ అబ్జర్వర్లు 6 కేంద్రాలను, ఫ్లయింగ్ స్క్వాడ్స్ 36 కేంద్రాలను తనిఖీ చేశాయి.

News April 2, 2026

ఖమ్మంలో ఫ్లెక్సీల హోరు.. వ్యాపారం జోరు

image

ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఫ్లెక్సీల వ్యాపారం ఒక్కసారిగా పుంజుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా అన్ని శాఖల అధికారులు అవగాహన ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండటంతో ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. నేటి నుంచి గ్రామసభలు ప్రారంభం కావడం, దీనికి తోడు పెళ్లిళ్ల సీజన్ కూడా తోడవడంతో ప్రింటింగ్ సెంటర్లు రేయింబవళ్లు పని చేస్తున్నాయి.

News April 2, 2026

ఖమ్మం: ఆన్‌లైన్‌కే ప్రోగ్రెస్ కార్డులు

image

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డుల పంపిణీకి విద్యాశాఖ స్వస్తి పలికింది. ఏళ్ల తరబడి సరఫరా నిలిచిపోవడంతో హెడ్ మాస్టర్లు సొంత ఖర్చులతో కార్డులు కొనే పరిస్థితి ఏర్పడింది. ఈ భారాన్ని తగ్గిస్తూ ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఒక కేటగిరీ, ఆరు నుంచి పదో తరగతి వరకు మరో కేటగిరీగా విభజించి ఇకపై కేవలం ఆన్‌లైన్ ద్వారానే ఫలితాల కార్డులు జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు.