News April 13, 2024

ఈ సీజన్‌లో స్ట్రగ్లింగ్ స్టార్స్ వీరే?

image

ఈ IPL సీజన్‌లో ఐదుగురు దారుణ ప్రదర్శన కనబరుస్తున్నారు. రాజస్థాన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ 5 మ్యాచ్‌లు ఆడి 25 రన్స్ చేసి స్ట్రగుల్ అవుతున్నారు. పంజాబ్ ఓపెనర్ జానీ బెయిర్ స్టో 5 మ్యాచ్‌ల్లో 81 పరుగులే చేశారు. ఆర్సీబీ ఆల్‌రౌండర్లు గ్లెన్ మ్యాక్స్‌వెల్ 6 మ్యాచ్‌ల్లో 32, కామెరూన్ గ్రీన్ 5 మ్యాచ్‌ల్లో 68 పరుగులే చేసి సతమతమవుతున్నారు. మరోవైపు ఢిల్లీ బౌలర్ నోకియా 4 మ్యాచ్‌లు ఆడి ఏకంగా 215 రన్స్ ఇచ్చారు.

Similar News

News March 7, 2026

కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుల కోసం దరఖాస్తులు: సుగుణ

image

ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు ఉమ్మడి ఆసిఫాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులను నియమించనున్నట్లు డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క తెలిపారు. మార్చి 13లోపు మండల అధ్యక్షుల ఎంపిక, 23లోపు పూర్తిస్థాయి కమిటీల ఏర్పాటు పూర్తి చేస్తామన్నారు. ఈ మేరకు మండల కేంద్రాల్లో నిర్వహించే సమావేశాల్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. ఆసక్తి ఉన్న నాయకులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News March 7, 2026

అమెరికాకు షాక్.. కీలక వ్యవస్థను ధ్వంసం చేసిన ఇరాన్!

image

అమెరికాకు ఇరాన్ షాకిచ్చింది. గల్ఫ్‌లో క్షిపణి రక్షణ వ్యవస్థలకు కీలకమైన రాడార్ సిస్టమ్‌ను దెబ్బతీసింది. <<14350576>>థాడ్(THAAD)<<>>లో ఉపయోగించే రాడార్ పరికరాలను ధ్వంసం చేసింది. జోర్డాన్‌లోని మువాఫాక్ సాల్టి వైమానిక స్థావరంలో ఉన్న ఈ రాడార్ సిస్టమ్‌పై యుద్ధం ప్రారంభంలోనే దాడి జరిగిందని అమెరికా అధికారులు ధ్రువీకరించారు. ఈ సిస్టమ్ విలువ $300M(₹2,760Cr) పైనే. ప్రపంచంలో USకు 8 థాడ్ వ్యవస్థలున్నాయి.

News March 7, 2026

ఈ కలర్ క్లాత్స్‌తో సమ్మర్‌లో హాయ్ హాయ్..!

image

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం వేళ ఇళ్ల నుంచి బయటికి వెళ్లేవారు కొన్ని రంగుల దుస్తులకు ప్రయారిటీ ఇస్తే శరీరం చల్లగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. తెలుపు, లైట్ బ్లూ, లైట్ గ్రే, సాఫ్ట్ పింక్, పేల్ గ్రీన్, లావెండర్, పౌడర్ బ్లూ, క్రీమ్ తదితర రంగుల దుస్తులు వాడాలని సూచిస్తున్నారు. ఇవి సూర్యకాంతిని రిఫ్లెక్ట్ చేసి తక్కువ వేడిని గ్రహిస్తాయి. అలాగే చెమటను త్వరగా ఆరేలా చేస్తాయి.