News April 13, 2024
కొల్చారం: టాస్క్‌ఫోర్స్ పోలీసులపై ఇసుక మాఫియా దాడి !

కొల్చారం మండలం నాయిని జలాల్‌పూర్ గ్రామ కొంగోడు శివారులోని హల్దీ వాగులో గ్రామానికి చెందిన కొంత మంది మాఫియాగా ఏర్పడి రాత్రి సమయాల్లో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ఈ విషయమై టాస్క్‌ఫోర్స్ సీఐ తిరుమలేశ్ అధ్వర్యంలో వారిని పట్టుకోవడానికి వెళ్లగా ఇసుక మాఫీయాలో కొంత మంది పోలీసులపై దాడి చేసినట్లు సీఐ పేర్కొన్నారు. ఈ కేసులో దాడి చేసి రాజు, నవీన్ మరి కొందరిపై కొల్చారం PSలో ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు.
Similar News
News March 20, 2026
రంజాన్ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్

పవిత్ర రంజాన్ పండుగను ముస్లిం సోదరులందరూ శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆకాంక్షించారు. రంజాన్ మాసం క్రమశిక్షణ, దాతృత్వం, మత సామరస్యానికి ప్రతీక అని ఆమె పేర్కొన్నారు. నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు చేపట్టిన ప్రతి ఒక్కరికీ ఈ పండుగ సుఖసంతోషాలను, ఆరోగ్యాన్ని చేకూర్చాలని ఆమె శుభాకాంక్షలు తెలిపారు.
News March 20, 2026
విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపులు నిరాశాజనకం: టీపీటీఎఫ్

బడ్జెట్‌లో విద్యారంగానికి జరిగిన కేటాయింపులు నిరాశాజనకంగా ఉన్నాయని టీపీటీఎఫ్ మెదక్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె. యాదగిరి, పి. వెంకట్‌రామ్ రెడ్డి విమర్శించారు. మొత్తం 3,24,234 కోట్ల బడ్జెట్‌లో విద్యకు కేవలం 26,674 కోట్లు అంటే 8.22\% మాత్రమే కేటాయించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఈ నిధులు ఏమాత్రం సరిపోవని వారు పేర్కొన్నారు.
News March 20, 2026
మెదక్ DCC కార్యదర్శిగా గడ్డి వెంకటేష్

తూప్రాన్ మండలం ఘనపూర్ గ్రామానికి చెందిన గడ్డి వెంకటేష్ యాదవ్‌ను కాంగ్రెస్ మెదక్ జిల్లా కార్యదర్శిగా నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారు. తన నియామకానికి సహకరించిన నేతలు మైనంపల్లి హనుమంతరావు, జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావులకు వెంకటేష్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.


