News November 19, 2025

వరికోత మిషన్ల కొరత.. రైతుల ఆందోళన

image

ఖమ్మం జిల్లాలో వరికోతల సమయంలో మిషన్ల కొరత ఏర్పడటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల వచ్చిన మొంథా తుపాను కారణంగా రైతులు వరికోతలు వాయిదా వేసుకున్నారు. దీంతో పంట పొలాలన్నీ ఒకేసారి కోతకు రావడంతో మిషన్లు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పంట చేతికొచ్చే అవకాశం ఉండదని అన్నదాతలు వాపోతున్నారు.

Similar News

News March 22, 2026

జగిత్యాల: జీవన్ రెడ్డికి బిగ్ రోల్.. పార్టీ బలోపేతానికి ప్లాన్?

image

బీఆర్ఎస్‌లో చేరనున్న జీవన్ రెడ్డికి సెక్రటరీ జనరల్ వంటి కీలక పదవి ఇవ్వాలని పార్టీ అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. ఆయన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో ఆయన చిన్న కోడలు చరిష్మా రెడ్డికి జగిత్యాల నుంచి ఎమ్మెల్యే టికెట్ కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో స్థానిక రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి.

News March 22, 2026

శ్రీశైలం మల్లన్న సన్నిధికి పెరుగుతున్న విదేశీ భక్తులు

image

శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి విదేశీ, ఎన్ఆర్ఐ భక్తుల సంఖ్య పెరుగుతోంది. శనివారం జరిగిన హుండీ కానుకల లెక్కింపులో అత్యధిక సంఖ్యలో విదేశీ కరెన్సీ రావడమే అందుకు నిదర్శనం. 624 USA డాలర్లు, 210 UAE దిర్హామ్స్, 10 సింగపూర్ డాలర్స్, 20 ఇంగ్లండ్ పౌండ్స్, 25 ఆస్ట్రేలియా డాలర్లు, 70 యూరోలు, వీటితో పాటు కువైట్ దినార్లు, కెనడా, న్యూజిలాండ్ డాలర్లు వచ్చాయని అధికారులు వివరించారు.

News March 22, 2026

అంబేడ్కర్ వర్సిటీకి పాలక మండలి లేదా?

image

ఎచ్చెర్లలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో పాలకమండలి లేదా? అన్న సందేహం ప్రతి ఒక్కరిలో కలుగుతోంది. 2022 నవంబర్ తర్వాత పాలకమండలి సమావేశం జరగలేదు. పాలకమండలిలో 12 మంది సభ్యులు ఉంటారు, ఏడుగురు అత్యవసర సభ్యులు. కాగా ఆరు నెలలకు ఓసారి కచ్చితంగా మండలి సమావేశం జరగాలి. అయితే అలా జరగడం లేదు. దీంతో పాలన గాడి తప్పిందనే అభిప్రాయాన్ని విద్యార్థులు, మేధావులు వ్యక్తం చేస్తున్నారు.