News November 19, 2025

వరికోత మిషన్ల కొరత.. రైతుల ఆందోళన

image

ఖమ్మం జిల్లాలో వరికోతల సమయంలో మిషన్ల కొరత ఏర్పడటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల వచ్చిన మొంథా తుపాను కారణంగా రైతులు వరికోతలు వాయిదా వేసుకున్నారు. దీంతో పంట పొలాలన్నీ ఒకేసారి కోతకు రావడంతో మిషన్లు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పంట చేతికొచ్చే అవకాశం ఉండదని అన్నదాతలు వాపోతున్నారు.

Similar News

News March 23, 2026

కొత్తపట్నం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

image

ప్రకాశం జిల్లాలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తపట్నంలోని భారత్ పెట్రోల్ బంకు వద్ద బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని RTC బస్సు ఢీకొనడంతో రోడ్డుపై పడిపోయాడు. పడిపోయిన వ్యక్తిని బస్సు డ్రైవర్ గమనించక బస్సు తలపైకి ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలుకు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 23, 2026

‘సిరిసిల్ల కోర్టుకు బాంబు బెదిరింపు.. అంతా ఫేక్’

image

రాజన్న సిరిసిల్ల జిల్లా కోర్టుకు ఈరోజు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు రావడంతో కలకలం రేగింది. పోలీసులు వెంటనే అప్రమత్తమై న్యాయమూర్తులు, సిబ్బందిని సురక్షితంగా బయటకు తరలించారు. BD, డాగ్ స్క్వాడ్‌తో గాలించగా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. దీంతో అది ఫేక్ మెయిల్‌గా తేలింది. కోర్టు చీప్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (CAO) ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సిరిసిల్ల టౌన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.