News November 18, 2025

BHPL జిల్లాలో కనిష్ఠంగా 10 డిగ్రీలు నమోదు

image

రేగొండ, గోరి కొత్తపల్లి మండల గ్రామాల్లో చలి తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. గ్రామాల్లో ఉదయం పొగమంచు, చలిగాలులు వీస్తుండగా, రాత్రి సమయంలో చలి తీవ్రత అధికంగా ఉంటుంది. గ్రామాల్లో ఉదయం కనిష్ఠంగా 10 నుంచి 12డిగ్రీలు, గరిష్ఠంగా 29 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో ఉదయం ప్రయాణించే ప్రయాణికులు పొగమంచుతో ఇబ్బందులు పడుతున్నారు. 

Similar News

News November 18, 2025

అల్లూరి: ‘చైతన్యాన్ని రగిలించిన మహోన్నత వ్యక్తి’

image

రచనల ద్వారా సమాజంలో చైతన్యాన్ని రగిలించిన మహోన్నత వ్యక్తి కనకదాసు అని కలెక్టర్ దినేశ్ కుమార్ అన్నారు. భక్త కనకదాసు ఒక గొప్ప కవిగా, తత్వవేత్తగా, అపారమైన సామాజిక సంస్కర్తగా అందించిన సేవలను దేశం స్మరించుకుంటోందన్నారు. మంగళవారం భక్త కనకదాసు జయంతిని కలెక్టరేట్‌లో నిర్వహించారు. అతని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కనకదాసు జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

డిజిటల్ అరెస్ట్ వ్యవస్థ లేదు: SP జానకి షర్మిల

image

చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనే వ్యవస్థ లేదని SP జానకి షర్మిల అన్నారు. వీడియో కాల్, వాట్సాప్, ఫోన్ ద్వారా ఎవరైనా “మీరు కేసులో ఉన్నారు” “మీరు అరెస్టులో ఉన్నారు” అని బెదిరిస్తే ప్రజలు నమ్మవద్దన్నారు. వ్యక్తిగత, బ్యాంక్, OTP, UPI, ఆధార్, వివరాలు తెలపవద్దన్నారు. డబ్బులు అడిగితే వెంటనే కాల్‌ కట్ చేయాలని, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు లేదా https://www.cybercrime.gov ఫిర్యాదు చేయాలని సూచించారు.