News November 18, 2025

హిడ్మాకు బహుభాషల్లో పట్టు

image

మడావి హిడ్మా మావోయిస్టు పార్టీలో భారీ గెరిల్లా దాడులకు వ్యూహకర్త. తెలంగాణ కమిటీ, పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ(PLGA)కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. హిడ్మాకు పార్టీలో విలాస్, హిడ్మాల్, సంతోష్‌ అనే పేర్లు ఉన్నాయి. మురియా తెగకు చెందిన ఆయనకు హిందీ, గోండు, తెలుగు, కోయ, బెంగాలీ భాషల్లో పట్టుంది. కొద్దిరోజులుగా అతడు లొంగిపోతాడనే ప్రచారం జరిగినా ఈ ఉదయం అల్లూరి జిల్లాలో ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు.

Similar News

News November 18, 2025

కల్వకుర్తి: పత్తి రైతుల సమస్యలు పాలకులకు పట్టవా?: మాజీమంత్రి

image

పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. కల్వకుర్తి పట్టణంలోని కాటన్ మిల్లు వద్ద మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌తో కలిసి మంగళవారం ఆయన నిరసన తెలిపారు. గతంలో ఎకరాకు 12 క్వింటాళ్లు కొనుగోలు చేసిన సీసీఐ ప్రస్తుతం 7 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

News November 18, 2025

5 రోజుల్లో రూ.5వేలు తగ్గిన ధర.. కారణమేంటి?

image

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల <<18318028>>పతనం కొనసాగుతోంది<<>>. 5 రోజుల్లోనే 10గ్రాముల పసిడి ధర దాదాపు రూ.5వేలు, కేజీ వెండి రేటు రూ.15వేల వరకు తగ్గింది. వచ్చే నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం లేదనే అంచనాలతో గోల్డ్‌కు డిమాండ్ తగ్గినట్లు నిపుణుల అంచనా. అలాగే US డాలర్ బలపడటమూ ఓ కారణమని చెబుతున్నారు. కాగా ఫెడ్ వడ్డీ రేట్లు గోల్డ్ ధరలను ప్రభావితం చేసే విషయం తెలిసిందే.