News November 19, 2025

ఖమ్మం: చలా పంజా.. గజగజ వణుకుతున్న ప్రజలు

image

ఉమ్మడి జిల్లాలోని పల్లెలపై చలి పంజా విసురుతోంది. సాయంత్రం 6 గంటల నుంచే చలి తీవ్రత మొదలవుతుండటంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. రాత్రి నుంచి ఉదయం 10 గంటల వరకు చలి ప్రభావం ఎక్కువగా ఉంటోంది. దీంతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

Similar News

News March 18, 2026

NTR: చుక్కలు చూపిస్తున్న నిమ్మ ధర

image

వేసవి ఎండలు ముదురుతుండటంతో నిమ్మకాయలకు గిరాకీ పెరిగింది. NTR జిల్లా వ్యాప్తంగా నిమ్మకాయల దిగుమతులు తగ్గడంతో మార్కెట్‌లో తీవ్ర కొరత ఏర్పడింది. ప్రస్తుతం ఒక్కో నిమ్మకాయ ధర నాణ్యతను బట్టి రూ.5 నుంచి రూ.10 వరకు పలుకుతోంది. ధర భారీగా ఉన్నప్పటికీ, మార్కెట్‌లో కాయలు దొరకని పరిస్థితి నెలకొందని వినియోగదారులు వాపోతున్నారు. ఎండల వేడి నుంచి ఉపశమనం కోసం నిమ్మరసాన్ని ఆశ్రయించే సామాన్యుడికి ఈ ధరలు భారంగా మారాయి.

News March 18, 2026

TGNPDCL అధికారుల డిప్యూటేషన్‌కు ఆదేశాలు

image

హనుమకొండ: TGNPDCL నుంచి TGRPDCLకు 12 మంది అధికారులను డిప్యూటేషన్‌పై పంపిస్తూ CMD కర్ణాటి వరుణ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త డిస్కం ఏర్పాటుతో కార్యకలాపాల ప్రారంభం, ఆస్తులు-బాధ్యతల విభజన, నెట్‌వర్క్ పునర్వ్యవస్థీకరణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. అధికారులు తక్షణమే హాజరుకావాలని, డిప్యూటేషన్ గడువు ఒక సంవత్సరం అని తెలిపారు.

News March 18, 2026

విశాఖ: స్టీల్ ప్లాంట్‌‌లో 5 రోజుల వరకే గ్యాస్ నిల్వలు

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఎల్పీజీ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. పశ్చిమ ఆసియా యుద్ధంతో కేంద్రం ఆంక్షలు విధించి గృహ, ఆస్పత్రులకే ప్రాధాన్యం ఇచ్చింది. ప్లాంట్ ఉత్పత్తికి రోజుకు 12 టన్నుల గ్యాస్ అవసరముండగా కేవలం 5 రోజుల నిల్వలే మిగిలాయి. కటింగ్ పనులు, ఉత్పత్తి నిలిచే ప్రమాదం ఉంది. స్టీల్ బ్లూమ్స్‌ను బయట ప్రాసెసింగ్‌కు పంపడంతో ఖర్చులు పెరుగుతున్నాయి. కేటాయింపులు పెంచాలని నాయకులు డిమాండ్ చేస్తున్నారు.