News November 18, 2025
మంచిర్యాలలో అమానవీయ ఘటన

మంచిర్యాలలో అమానవీయ ఘటన జరిగింది. సాయి హనుమాన్ నగర్‌కు చెందిన వృద్ధురాలు నాడెం రాజు ఆదివారం రాత్రి మృతి చెందింది. కుమార్తె లలిత పాత ఇంటిలో వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మృతదేహాన్ని పాత మంచిర్యాలలోని ఇంటికి తరలించింది. ఈ విషయం సీఐ ప్రమోద్ రావు దృష్టికి వెళ్లడంతో ఆయన జోక్యంతో మృతదేహాన్ని వెనక్కి తెచ్చారు. తల్లి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలపై పంచుకునేందుకు అంగీకారం కుదరడంతో అంత్యక్రియలు పూర్తి చేశారు.
Similar News
News November 18, 2025
కల్వకుర్తి: పత్తి రైతుల సమస్యలు పాలకులకు పట్టవా?: మాజీమంత్రి

పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. కల్వకుర్తి పట్టణంలోని కాటన్ మిల్లు వద్ద మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌తో కలిసి మంగళవారం ఆయన నిరసన తెలిపారు. గతంలో ఎకరాకు 12 క్వింటాళ్లు కొనుగోలు చేసిన సీసీఐ ప్రస్తుతం 7 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

TML: టోకెన్లు లేకుండా శ్రీనివాసుడి దర్శనం

తిరుమలలో జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సర్వదర్శనానికి టీటీడీ ప్రాధాన్యమిచ్చింది. గత అనుభవాల దృష్ట్యా ఆఫ్‌లైన్ టోకెన్లను పూర్తిగా రద్దు చేసింది. కొండకు వచ్చిన వాళ్లు వచ్చినట్లు నేరుగా దర్శనానికి వెళ్లిపోవచ్చు. తిరుమల వైకుంఠ ద్వార దర్శనం 10 రోజుల్లో 182 గంటల పాటు ఉంటుంది. ఇందులో 164 గంటలు సామాన్య భక్తులనే అనుమతిస్తారు. ఇదే సమయంలో ఎక్కువ టైం షెడ్డుల్లో ఉంచకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.