News November 19, 2025

కారంపూడి: రాచగావు అంటే ఏమిటో తెలుసా..?

image

కారంపూడిలో నేటి నుంచి పల్నాడు వీరుల ఉత్సవాలు రాచగావుతో ప్రారంభం అవుతున్నాయి. రాచగావు అంటే ఏమిటో తెలుసా..? రాచగావు అనేది వీరుల గుడి పూజారులు పోతురాజు ఆచారవంతునితో కలిసి పోతురాజుకు గావు (రక్షణతో కూడిన చూపు లేదా సేవ) చేస్తూ, ఉత్సవాలకు ప్రారంభం చేస్తారు. ఈ కార్యక్రమం పాటలు, వీర నృత్యాలతో జరుగుతుంది ఉత్సవాలలో వీరుల ఆరాధన, వారి ధైర్య గాథలకు భక్తి తెలియజేసే ముఖ్యమైన పురాణ సాంప్రదాయంగా ఉంది.

Similar News

News April 1, 2026

ఇక మిడిల్ లెవెల్ మేనేజర్లు అవసరం లేదా?

image

అవుననే అంటున్నారు ట్విటర్ కోఫౌండర్ జాక్ డోర్సే. మేనేజ్‌మెంట్, ఉద్యోగుల మధ్య వారధిగా పనిచేసే వీరి అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. వీరు నిర్వహించే కోఆర్డినేషన్, వర్క్ ప్రోగ్రెస్ ట్రాకింగ్ వంటి పనులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా సమర్థంగా, వేగంగా చేయగలదని అభిప్రాయపడ్డారు. బిజినెస్ అప్డేట్ సిస్టమ్‌ను ఉపయోగించుకొని వర్క్‌ను కోఆర్డినేట్ చేసుకోగలదని, ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుందని వివరించారు.

News April 1, 2026

జగిత్యాల: ‘తల్లిదండ్రులకు నమ్మకం కలిగేలా పనిచేయాలి’

image

సంక్షేమ హాస్టళ్లపై తల్లిదండ్రులకు నమ్మకం కల్పించేలా అధికారులు పనిచేయాలని, 60 రోజుల్లో హాస్టల్స్‌లో మౌలిక సదుపాయాలు పనులు పూర్తి చేయాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం జగిత్యాల జిల్లా సంక్షేమ హాస్టల్స్ సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేసి నిర్వహిస్తున్న సంక్షేమ హాస్టలలో విద్యార్థులకు విద్యతోపాటు అన్ని సౌకర్యాలు కల్పనకు కృషి చేయాలని తెలిపారు.

News April 1, 2026

ములుగు: ఈ నెలలోనే మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ

image

ములుగు జిల్లాలో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్‌లోనే మూడు నెలలకు సంబంధించిన బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు ఒక్కో లబ్ధిదారుడికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందించనున్నారు. జిల్లాలో సుమారు 1.02 లక్షల కార్డులకు 5,490 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేయనున్నట్లు అధికారులు తెలిపారు.