News November 19, 2025

కారంపూడి: రాచగావు అంటే ఏమిటో తెలుసా..?

image

కారంపూడిలో నేటి నుంచి పల్నాడు వీరుల ఉత్సవాలు రాచగావుతో ప్రారంభం అవుతున్నాయి. రాచగావు అంటే ఏమిటో తెలుసా..? రాచగావు అనేది వీరుల గుడి పూజారులు పోతురాజు ఆచారవంతునితో కలిసి పోతురాజుకు గావు (రక్షణతో కూడిన చూపు లేదా సేవ) చేస్తూ, ఉత్సవాలకు ప్రారంభం చేస్తారు. ఈ కార్యక్రమం పాటలు, వీర నృత్యాలతో జరుగుతుంది ఉత్సవాలలో వీరుల ఆరాధన, వారి ధైర్య గాథలకు భక్తి తెలియజేసే ముఖ్యమైన పురాణ సాంప్రదాయంగా ఉంది.

Similar News

News March 22, 2026

‘చచ్చాడు.. సంతోషం’: ట్రంప్ నోటి దురుసు!

image

అమెరికాలో FBI మాజీ డైరెక్టర్ రాబర్ట్ ముల్లర్ (81) కన్నుమూశారు. 9/11 దాడుల తర్వాత FBI రూపురేఖలు మార్చిన ఆయన ట్రంప్-రష్యా సంబంధాలపై ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆ కక్షను మనసులో పెట్టుకున్న ట్రంప్.. ముల్లర్ చనిపోగానే ‘చచ్చాడు.. చాలా సంతోషం. ఇక అమాయకులను వేధించలేడు’ అని అన్నారు. ఒక లెజెండరీ ఆఫీసర్ అంటూ చాలా మంది సంతాపం తెలుపుతుంటే ట్రంప్ ఇలాంటి కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది.

News March 22, 2026

విజయవాడ: గుణదల సీఐ వాసిరెడ్డి శ్రీను బదిలీ

image

నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పలువురు ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ రాజశేఖర్‌ బాబు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గుణదల సీఐగా ఉన్న వాసిరెడ్డి శ్రీను బదిలీ కాగా, ఆయన స్థానంలో సత్య రమేష్‌ను నియమించారు. అలాగే అజిత్‌ సింగ్‌ నగర్‌ సీఐగా చంద్రశేఖర్‌ నియామకమయ్యారు. అక్కడ పనిచేస్తున్న వెంకటేశ్వర నాయక్‌ను సీసీఎస్‌కు అటాచ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

News March 22, 2026

NLG: నాడు ఫ్లోరైడ్ కన్నీళ్లు.. నేడు కృష్ణా జలాలు..!

image

దశాబ్దాల పాటు ఫ్లోరైడ్ రక్కసితో తల్లడిల్లిన నల్గొండ ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యానికి చిరునామాగా మారింది. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ సురక్షిత కృష్ణా జలాలు అందుతుండటంతో ఈ మహమ్మారి పూర్తిగా అంతమైంది. జిల్లాలో కొత్తగా ఒక్క ఫ్లోరైడ్ కేసు కూడా నమోదు కాలేదని కేంద్రం సైతం పార్లమెంటులో ధ్రువీకరించింది. ఒకప్పుడు కలుషిత నీటితో అల్లాడిన ఆ నేల నేడు పచ్చని మాగాణిగా రూపుదిద్దుకుంది. నేడు ప్రపంచ జల దినోత్సవం.