News November 19, 2025

కారంపూడి: రాచగావు అంటే ఏమిటో తెలుసా..?

image

కారంపూడిలో నేటి నుంచి పల్నాడు వీరుల ఉత్సవాలు రాచగావుతో ప్రారంభం అవుతున్నాయి. రాచగావు అంటే ఏమిటో తెలుసా..? రాచగావు అనేది వీరుల గుడి పూజారులు పోతురాజు ఆచారవంతునితో కలిసి పోతురాజుకు గావు (రక్షణతో కూడిన చూపు లేదా సేవ) చేస్తూ, ఉత్సవాలకు ప్రారంభం చేస్తారు. ఈ కార్యక్రమం పాటలు, వీర నృత్యాలతో జరుగుతుంది ఉత్సవాలలో వీరుల ఆరాధన, వారి ధైర్య గాథలకు భక్తి తెలియజేసే ముఖ్యమైన పురాణ సాంప్రదాయంగా ఉంది.

Similar News

News March 22, 2026

విజయవాడలో కేజీ చికెన్ రూ. 380!

image

విజయవాడలో ఆదివారం సెలవు కావడంతో మాంసం మార్కెట్లు కిక్కిరిసిపోయాయి. చికెన్ స్కిన్‌లెస్ కేజీ రూ. 380 పలుకుతుండగా, మటన్ కేజీ రూ. 900కు చేరింది. సరఫరా తగ్గడం, డిమాండ్ పెరగడమే ఈ ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. చేపలు, గుడ్ల ధరలు నిలకడగా ఉన్నప్పటికీ, మాంసం ప్రియులకు మాత్రం ఈ వారం ‘ధరల వేడి’ తప్పడం లేదు. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News March 22, 2026

ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్షురాలిగా భాగ్యవతి

image

ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్షురాలిగా భాగ్యవతి నియమితులయ్యారు. యూనియన్ జాతీయ ఉపాధ్య క్షుడు డా.ఎం. వెంకటస్వామి, రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్‌‌లు ఈ నియామక పత్రం శనివారం ఇచ్చారు. ఆశా కార్యకర్తలు గ్రామ ఆరోగ్య వ్యవస్థలో కీలక పాత్ర పోషి స్తూ మాతాశిశు మరణాలు తగ్గిస్తున్నారని, గర్భిణులకు సేవలు, వ్యాక్సినేషన్లు, ప్రాథమిక ఔషధా‌లు అందించడంతో ముఖ్య పాత్ర పోషిస్తున్నారని ఆమె అన్నారు.

News March 22, 2026

ADB: చెప్పి చనిపోయిన రైతు.. స్పందించిన కలెక్టర్

image

ఆదిలాబాద్(రూ) మండలం అర్లి(బి) గ్రామానికి చెందిన రైతు తుడుం గణపతి <<19439320>>ఆత్మహత్య <<>>ఘటనపై కలెక్టర్ రాజర్షి షా స్పందించారు. గత నవంబర్ 18, 2025న గణపతి తీసుకువచ్చిన సోయాబీన్‌లో తేమ శాతం ఎక్కువగా ఉండటంతో ఆరబెట్టి మళ్లీ తీసుకురావాలని అధికారులు సూచించినట్లు తెలిపారు. 81 క్వింటాళ్ల సోయాబీన్‌కు సంబంధించిన మొత్తం చెల్లింపులు వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు.