News November 18, 2025
వందల మంది మృతికి హిడ్మానే కారణం!

దండకారణ్యంలో బలగాల్ని నడిపించే వ్యూహకర్తగా గుర్తింపు పొందిన హిడ్మా.. కేంద్ర బలగాలపై మెరుపుదాడుల్లో ఎప్పుడూ ముందుండేవాడు. PLGA 1వ బెటాలియన్‌కు నాయకత్వం వహిస్తూ, కేంద్ర కమిటీలో చిన్న వయస్కుడిగా ఎదిగాడు. పలు దాడుల్లో కీలకపాత్ర పోషించాడు.
*2010 దంతెవాడ దాడిలో 76 మంది CRPF జవాన్లు మృతి
*2013 జిరామ్ ఘాట్‌లో కాంగ్రెస్ నేతలతో సహా 27 మంది మృతి
*2021 సుక్మా-బీజాపూర్‌లో 22 మంది భద్రతా సిబ్బంది మృతి
Similar News
News November 18, 2025
‘U’ టైప్ దాడుల్లో సిద్ధహస్తుడు హిడ్మా!

గెరిల్లా దాడులకు పెట్టింది పేరైన మావోయిస్ట్ మోస్ట్ వాంటెడ్ హిడ్మా ఎన్నోసార్లు భద్రతా బలగాలను బోల్తా కొట్టించాడు. కూంబింగ్ సమయంలో బలగాలను చుట్టూ కొండలు ఉండి మధ్యలో లోతైన ప్రదేశానికి వచ్చేవరకు ఎదురుచూసేవాడు. ఆ తర్వాత మూడు వైపులా(U ఆకారంలో) మావోలను మోహరించి కాల్పులు చేయిస్తాడు. ముందు వైపు ఎత్తైన కొండలు ఉండటంతో బలగాలు తప్పించుకోవడానికి కష్టంగా మారేది. ఇలాంటి సమయాల్లో బలగాల ప్రాణనష్టం అధికంగా ఉండేది.

నితీశ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి CBN

AP: బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి CM CBN, మంత్రి లోకేశ్‌కు ఆహ్వానం అందింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో NDA కూటమి అక్కడ 202 సీట్లు సాధించడం తెలిసిందే. సభానేతగా నితీశ్‌కే మళ్లీ అవకాశం దక్కింది. 20న పట్నాలో ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి ఆహ్వానం అందడంతో CBN, లోకేశ్ కార్యక్రమానికి హాజరు కానున్నారు. బిహార్ ఎన్నికల్లో లోకేశ్ NDA తరఫున ప్రచారం చేశారు.