News November 19, 2025
ఖమ్మం: చలా పంజా.. గజగజ వణుకుతున్న ప్రజలు

ఉమ్మడి జిల్లాలోని పల్లెలపై చలి పంజా విసురుతోంది. సాయంత్రం 6 గంటల నుంచే చలి తీవ్రత మొదలవుతుండటంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. రాత్రి నుంచి ఉదయం 10 గంటల వరకు చలి ప్రభావం ఎక్కువగా ఉంటోంది. దీంతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
Similar News
News March 28, 2026
NTR: పవన్ కల్యాణ్‌కు థ్యాంక్స్ చెప్పిన చంద్రబాబు

అసెంబ్లీ వేదికగా డిప్యూటీ CM పవన్ కల్యాణ్‌కు CM చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఏకైక రాజధానిగా అమరావతి చట్టబద్ధతను పునరుద్ధరించే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా పవన్ అందించిన మద్దతును కొనియాడారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ పోషించిన పాత్ర చారిత్రాత్మకమని అన్నారు. ఎన్నికలకు ముందు తాను జైల్లో ఉన్నప్పుడు, రాష్ట్ర భవిష్యత్తు కోసం పార్టీలన్నీ కలిసి పోటీచేయాలని పవన్ తీసుకున్న చొరవను ప్రశంసించారు.
News March 28, 2026
NGKL: జాతీయ లోక్ అదాలత్‌లో 5,625 కేసుల పరిష్కారం

జిల్లాలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ ద్వారా 8 బెంచీలలో మొత్తం 5,625 కేసులు పరిష్కారమైనట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.ఆర్. సునీత తెలిపారు. రాజీ పడితే కక్షిదారులు ఇద్దరూ విజేతలేనని, సమయం, డబ్బు ఆదా అవుతుందని ఆమె పేర్కొన్నారు. చెక్ బౌన్స్, రోడ్డు ప్రమాదాలు, కుటుంబ తగాదాలు, డ్రంకెన్ డ్రైవ్ వంటి సివిల్, క్రిమినల్ కేసులను సామరస్యంగా పరిష్కరించుకున్నట్లు వెల్లడించారు.
News March 28, 2026
పూతలపట్టు: చెరువులో పడి వ్యక్తి మృతి

పూతలపట్టు మండలం ఎగువ పాలకురు గ్రామానికి చెందిన రామకృష్ణయ్య చెరువులో పడి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. దిగువ పాలకురు చెరువులో ఆవులు మేపడానికి వెళ్లి ఆవుల్ని అదుపు చేసే క్రమంలో చెరువులో దిగి ఈత రాకపోవడంతో ఊపిరాడక మృతి చెందాడు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉండి ఆవులు మేపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న వ్యక్తి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.


