News November 19, 2025

NLG: మహిళా సంఘాల పేరుతో రూ.1.50 కోట్లు స్వాహా

image

నల్గొండ పట్టణంలోని 3వ వార్డు పాతపల్లెకు చెందిన 12 సంఘాల పేరున ఆ గ్రామానికి చెందిన బుక్ కీపర్ ఒకరు బ్యాంకు ఫీల్డ్ అధికారులతో కలిసి కుమ్మక్కై కోటిన్నర రుణాలు తీసుకున్నారు. 4నెలల నుంచి చెల్లింపులు ఆగడంతో బ్యాంకు సిబ్బంది బాధితుల దగ్గరికి వెళ్లగా తమకేం తెలియదని చెప్పడంతో వారు ఆశ్చర్యపోయారు. బుక్ కీపర్, బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులు మంగళవారం బ్యాంకు ముందు నిరసన తెలిపారు.

Similar News

News March 14, 2026

తిరుమలలో మూడు ఆస్థానాలు

image

తిరుమలలో ఈ నెలలో మూడు ఆస్థానాలు జరగనున్నాయి. ఈనెల 19న ఉదయం 7గంటలకు ఉగాది ఆస్థానం నిర్వహిస్తారు. మూలవిరాట్, ఉత్సవమూర్తులకు కొత్త వస్త్రాలు సమర్పించి వేదపండితులు పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. 27న రాత్రి 9గంటలకు శ్రీరామనవమి ఆస్థానం జరుగుతుంది. సాయంత్రం 6.30 నుంచి 8 గంటల వరకు హనుమంత వాహన సేవ నిర్వహిస్తారు. తర్వాతి రోజు రాత్రి 8 గంటలకు పట్టాభిషేక ఆస్థానం జరుగుతుంది.

News March 14, 2026

ఆయన చొరవతో కేయూలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు!

image

కేయూ మాజీ ఉప కులపతి <<19381852>>ఆచార్య లింగమూర్తి<<>> పేద విద్యార్థులకు ఉన్నత సాంకేతిక విద్య అందించాలనే లక్ష్యంతో పరితపించేవారు. కేయూలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అనతి కాలంలోనే ఇంజినీరింగ్ కళాశాలతో పాటు, 40 శాశ్వత ఉద్యోగాలు మంజూరయ్యాయి. ప్రస్తుతం 6 బీటెక్ కోర్సుల్లో 360 మంది విద్యార్థులు ఇంజినీరింగ్ చేస్తున్నారు.

News March 14, 2026

కేయూ మాజీ వైస్ ఛాన్స్‌లర్ లింగమూర్తి మృతి

image

కాకతీయ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్‌లర్ లింగమూర్తి ఈరోజు మధ్యాహ్నం 12:20 గం.కు మృతి చెందారు. ఆయనకు భార్య అంజలి, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. గత ఆరు మాసాలుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు నెలలుగా హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆరోగ్యం క్షీణించడంతో వారం రోజుల క్రితం ఆయన నివాసానికి తీసుకురాగా ఈరోజు తుది శ్వాస విడిచారు.