News November 18, 2025
కరీంనగర్: సురేందర్ రెడ్డికి నేతల నివాళులు..!

ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి <<18317220>>బండ సురేందర్ రెడ్డి <<>>గుండెపోటుతో నిన్న రాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో పెద్దపల్లి MLA చింతకుంట విజయరమణా రావు, సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డికి KNRలో ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అంకితభావంతో పనిచేస్తూ అందరితో కలివిడిగా ఉండే సురేందర్ మృతి చెందడం బాధాకరమని వారన్నారు. సురేందర్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Similar News
News November 18, 2025
జిల్లాలో గంజాయిపై ఉక్కుపాదం మోపాలి: కలెక్టర్

జిల్లాలో మాదకద్రవ్యాల రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని, దీనిపై అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్ నుంచి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మితో కలిసి అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఆమె సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో గంజాయిపై ప్రత్యేక నిఘా ఉంచాలని, మాదకద్రవ్యాల నియంత్రణే లక్ష్యంగా అధికారులు పనిచేయాలన్నారు.

కడెం: ఇద్దరు ఫారెస్ట్ అధికారులు సస్పెండ్

నిర్మల్ జిల్లాలో ఇద్దరు ఫారెస్ట్ అధికారులు సస్పెండ్ అయ్యారు. కడెం మండలం ఉడుంపూర్ అటవీ రేంజ్ పరిధిలోగల పాత రాంపూర్ ఈస్ట్ బీట్ అధికారి మహేందర్‌తో పాటు డీఆర్ఓ చంద్రమౌళిలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయినట్లు ఎఫ్డీఓ శివకుమార్ తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకుగాను ఉన్నతాధికారులు వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.