News November 19, 2025
ఖమ్మం: చలా పంజా.. గజగజ వణుకుతున్న ప్రజలు

ఉమ్మడి జిల్లాలోని పల్లెలపై చలి పంజా విసురుతోంది. సాయంత్రం 6 గంటల నుంచే చలి తీవ్రత మొదలవుతుండటంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. రాత్రి నుంచి ఉదయం 10 గంటల వరకు చలి ప్రభావం ఎక్కువగా ఉంటోంది. దీంతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
Similar News
News March 13, 2026
చరిత్రలో ఈ రోజు (మార్చి 13)

1899: హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు జననం (ఫొటోలో)
1901: అమెరికా మాజీ అధ్యక్షుడు బెంజమిన్ హారిసన్ మరణం
1926: తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత వి.రామచంద్రరావు జననం
1940: జలియన్ వాలాబాగ్ కారకుడు మైఖేల్ డయ్యర్‌ను ఉద్దమ్ సింగ్ లండన్‌లో హతమార్చాడు
News March 13, 2026
ఖమేనీ భార్య బతికే ఉన్నారు: ఇరాన్ మీడియా

US, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ <<19282331>>ఖమేనీ భార్య<<>> మన్సౌరే ఖోజాస్తే బగెర్జాదేహ్ చనిపోయినట్లు వచ్చిన వార్తలను ఇరానియన్ మీడియా ఖండించింది. ఆమె బతికే ఉన్నారని IRGC అనుబంధ మీడియా సంస్థ ‘ఫార్స్’ న్యూస్ వెల్లడించింది. కొత్త సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ కూడా తన తొలి అధికారిక ప్రసంగంలో తల్లి మరణించారని ఎక్కడా ప్రస్తావించలేదు.
News March 13, 2026
WGL: వెంట్రుకల చోరీ కేసులో నలుగురి అరెస్టు

బట్టల బజార్‌లోని శ్యామల ఎంటర్‌ప్రైజెస్‌లో రూ.10 లక్షల విలువైన వెంట్రుకలను దోచుకెళ్లిన కేసులో నలుగురు నిందితులను మట్వాడ పోలీసులు అరెస్టు చేశారు. ఫిబ్రవరి 9న షేక్ బషీరా, షేక్ సలీమా, షేక్ నయీమ్,నాగన్న అనే వ్యక్తులు యజమాని కుమారస్వామిపై దాడి చేసి వెంట్రుకల బస్తాలను ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టి నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు చెప్పారు.


