News November 18, 2025
HYD: వాట్సాప్ మెసేజ్ తోనే రవిని పట్టుకున్నాం: DCP

iBOMMA రవి అరెస్ట్‌పై DCP కవిత కీలక ప్రకటన చేశారు. ‘iBOMMA రవికి అతడి కుటుంబసభ్యులతో పరిచయాలు లేవు. ఈ క్రమంలోనే HYDలో ఉన్న అతడి స్నేహితుడి గురించి సమాచారం రావడంతో మా టీమ్ అతడి కోసం వెళ్లింది. అదే సమయంలో అతడి ఫోన్‌కు రవి నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. తాను HYDకు వచ్చినట్లు రవి మెసేజ్ చేశాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నాం. ఆ తర్వాతే అతడికి ఫ్యామిలీ ఉందని తెలిసింది’ అన్నారు.
Similar News
News November 18, 2025
కడెం: ఇద్దరు ఫారెస్ట్ అధికారులు సస్పెండ్

నిర్మల్ జిల్లాలో ఇద్దరు ఫారెస్ట్ అధికారులు సస్పెండ్ అయ్యారు. కడెం మండలం ఉడుంపూర్ అటవీ రేంజ్ పరిధిలోగల పాత రాంపూర్ ఈస్ట్ బీట్ అధికారి మహేందర్‌తో పాటు డీఆర్ఓ చంద్రమౌళిలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయినట్లు ఎఫ్డీఓ శివకుమార్ తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకుగాను ఉన్నతాధికారులు వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

SRCL: ‘ప్రభుత్వ వైద్య సేవలపై అవగాహన కల్పించాలి’

ప్రభుత్వ వైద్య సేవలపై అవగాహన కల్పించాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రాజీవ్ నగర్ బస్తీ దవాఖాన, అంబేడ్కర్ నగర్ యూపీహెచ్‌సీల్లో మంగళవారం ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా ఆసుపత్రుల్లో ఓపీ రిజిస్టర్, ల్యాబ్, ఫార్మసీ, ఇమ్యూనైజేషన్ గది, ఇన్-పేషెంట్ గదులు, ఇతర గదులు, పరిసరాలను కలెక్టర్ పరిశీలించారు.