News November 19, 2025
ఈ నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్?

TG: BCలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించడంతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. 50%లోపు రిజర్వేషన్లతో డెడికేటెడ్ కమిషన్ 2 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఆ తర్వాత రిజర్వేషన్లను ఫైనల్ చేసి గెజిట్ జాబితాను ECకి అందిస్తారు. ఈ నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు సమాచారం. DEC 25లోగా 3 విడతల్లో ఎలక్షన్స్ పూర్తి చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News March 14, 2026
వారం రోజుల్లో ‘గాంధీ సరోవర్’కు శంకుస్థాపన!

TG: మూసీ బ్యూటిఫికేషన్‌లో భాగంగా చేపడుతోన్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు వారం రోజుల్లో శంకుస్థాపన జరగనుంది. ఎల్లుండి నుంచి జరిగే అసెంబ్లీ సెషన్‌లో దీనిపై చర్చించి ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెట్టనుంది. మూసీ ఒడ్డున ఉన్న 800ఏళ్ల నాటి శివాలయాన్నీ పునరుద్ధరించనుంది. ఉస్మానియా ఆస్పత్రి స్థలంలో మల్టీపర్పస్ కాంప్లెక్స్ నిర్మించనుంది. ఓ భారీ మసీదును నిర్మించేందుకు సౌదీ యువరాజు ముందుకొచ్చినట్లు సమాచారం.
News March 14, 2026
కష్ట సమయంలో ఇరాన్ ప్రజలకు అండగా ఉంటాం: చైనా

ఇరాన్‌కు మానవతా సహాయం కింద 2 లక్షల డాలర్లను (రూ.1.85 కోట్లు) విరాళంగా ఇస్తున్నట్లు చైనా ప్రకటించింది. మిస్సైల్ దాడిలో మరణించిన 165 మంది స్కూల్ పిల్లల తల్లిదండ్రులకు ఈ సాయం అందిస్తున్నట్లు వెల్లడించింది. స్కూళ్లు, పిల్లలపై దాడి చేయడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొంది. ఇలాంటి కష్ట సమయంలో తాము ఇరాన్ ప్రజలకు అవసరమైన సాయం చేస్తామని ప్రకటించింది.
News March 14, 2026
మామిడి పిందెల దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మామిడి పిందెలు బఠాణి నుంచి నిమ్మకాయ సైజు మధ్య ఉన్నప్పుడు 25 నుంచి 30 రోజులకు ఒకసారి తేలికపాటి నీటి తడులు ఇస్తే పిందె రాలడం తగ్గుతుంది. అలాగే లీటరు నీటిలో 10 గ్రాముల యూరియా లేదా పొటాషియం నైట్రేట్ 10 గ్రాములను కలిపి పిందెలు నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు ఒకసారి, మరలా 20 రోజుల తర్వాత 2వసారి పిచికారీ చేస్తే పిందె రాలడం తగ్గి, వాటి ఎదుగుదల బాగుంటుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.


