News November 19, 2025

మద్యం తాగాలంటూ ఏయూ హాస్టల్లో బెదిరింపులు

image

దేశంలోనే ప్రఖ్యాతి చెందిన ఏయూ పరువు రోజు రోజుకూ దిగజారుతోందని పలువురు ఆవేదన చెందుతున్నారు. ఏయూలో నిన్న జరిగిన ఓ కార్యక్రమానికి కలెక్టర్ హరేంధిర ప్రసాద్, CP శంఖబ్రత బాగ్చీ వచ్చారు. ఈ క్రమంలో ఓ విదేశీ విద్యార్థి వారి వద్దకు వెళ్లి తమ హాస్టల్లో కొంతమంది విద్యార్థులు మద్యం తాగాలంటూ బలవంతం చేస్తున్నారని ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని కమిటీ వేసి చర్యలు తీసుకుంటామని VC రాజశేఖర్ తెలిపారు.

Similar News

News March 24, 2026

సుప్రీం తీర్పు సరే.. క్రైస్తవంలో చేరారని నిరూపించేదెలా?

image

క్రైస్తవంలోకి మారిన వారు SC హక్కులు పొందలేరని సుప్రీంకోర్టు <<19462779>>తీర్పు<<>> ఇచ్చింది. అయితే బాప్టిజం సర్టిఫికెట్ లేకుండా క్రైస్తవాన్ని స్వీకరించినట్లు నిరూపించడం ఎలాగనేది అతిపెద్ద ప్రశ్న. ఎందుకంటే చర్చికి వెళ్లడం, పేర్లు మార్చుకోవడంతో మతం మారినట్లు చెప్పలేం. అలాంటి చట్టాలేవీ దేశంలో అమలులో లేవు. పలు రాష్ట్రాల్లో మత నిరోధక బిల్లులున్నా వాటి పాత్ర పరిమితం. ఈ అంశంపై విధివిధానాల రూపకల్పన అవసరం. ఏమంటారు?

News March 24, 2026

వనపర్తి: మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ!

image

వనపర్తి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ భవనంలోని RSETI లో మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. ఆసక్తి గలవారు SSC మెమో, ఆధార్, రేషన్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్ జిరాక్స్, 3 ఫొటోలతో ఈనెల 28లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వివరాలకు 8522088978 నంబర్‌ను సంప్రదించవచ్చు.

News March 24, 2026

రన్‌టైమ్‌తో పనేంటి.. కథ బాగుంటే హిట్టే!

image

సినిమా సక్సెస్‌కు నిడివి ముఖ్యం కాదని, ప్రేక్షకులను కట్టిపడేసే కథే ప్రధానమని యానిమల్(3:24H), పుష్ప-2(3:21), ధురంధర్ 1&2(3:40& 3:51) చిత్రాలు నిరూపించాయి. బలమైన కథతో వస్తే జనాలు బ్రహ్మరథం పడతారని ఇవి స్పష్టం చేశాయి. రొటీన్ ఫార్ములాలు కాకుండా ఎమోషన్స్, ఎంగేజింగ్ స్క్రీన్‌ప్లేతో వస్తే రన్‌టైమ్ అడ్డంకి కాదని తేలిపోయింది. కంటెంట్ బాగుంటే ఆడియన్స్‌ ఎన్ని గంటలైనా కూర్చుంటారనడానికి వీటి వసూళ్లే సాక్ష్యం.