News November 19, 2025
మద్యం తాగాలంటూ ఏయూ హాస్టల్లో బెదిరింపులు

దేశంలోనే ప్రఖ్యాతి చెందిన ఏయూ పరువు రోజు రోజుకూ దిగజారుతోందని పలువురు ఆవేదన చెందుతున్నారు. ఏయూలో నిన్న జరిగిన ఓ కార్యక్రమానికి కలెక్టర్ హరేంధిర ప్రసాద్, CP శంఖబ్రత బాగ్చీ వచ్చారు. ఈ క్రమంలో ఓ విదేశీ విద్యార్థి వారి వద్దకు వెళ్లి తమ హాస్టల్లో కొంతమంది విద్యార్థులు మద్యం తాగాలంటూ బలవంతం చేస్తున్నారని ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని కమిటీ వేసి చర్యలు తీసుకుంటామని VC రాజశేఖర్ తెలిపారు.
Similar News
News March 12, 2026
SVU: ఏప్రిల్ 15 నుంచి పరీక్షలు ప్రారంభం

శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోని M.P.Ed/ B.P.Ed/ D.P.Ed 4వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైనట్లు వర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి రాజమాణిక్యం పేర్కొన్నారు. ఏప్రిల్ 15వ తేదీ నుంచి 18 తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని తెలియజేశారు. ఎస్వీ ఆర్ట్స్ కాలేజ్, మదనపల్లె బీటీ కళాశాలలోని రెండు కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
News March 12, 2026
ఆదోనిలో లెటర్ రాసి సూసైడ్

ఆదోనిలోని కల్లుబావి వీధిలో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం చోటుచేసుకుంది. బంధువుల వివరాల మేరకు.. కురువ రాఘవేంద్రకు రెండెకరాలు సొంత పొలం ఉంది. దీంతో పాటు మరో ఐదెకరాలలో వ్యవసాయం చేసేవాడు. వ్యవసాయం, ఇతర ఖర్చుల కోసం రూ.10 లక్షలకు పైగా అప్పులు చేశాడు. వాటిని ఎలా తీర్చాలో తెలియక అయోమయానికి గురై తన చావుకు అప్పులే కారణం అంటూ లెటర్ రాసి ఇంట్లో ఉరేసుకొన్నాడు.
News March 12, 2026
డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్‌కు వాడొద్దు: సివిల్ సప్లై కమిషనర్

TG: డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను కమర్షియల్ అవసరాలకు వాడొద్దని సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సూచించారు. కృత్రిమ కొరత సృష్టించినా, అక్రమంగా నిల్వ చేసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్యాస్ అక్రమ వినియోగంపై టోల్ ఫ్రీ నంబర్ల(1967, 180042500333)కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఇప్పటివరకు జరిగిన తనిఖీల్లో ₹2.36L విలువైన సిలిండర్లను పట్టుకున్నామని, రాష్ట్రవ్యాప్తంగా 7 కేసులు నమోదయ్యాయని చెప్పారు.


