News November 19, 2025
మద్యం తాగాలంటూ ఏయూ హాస్టల్లో బెదిరింపులు

దేశంలోనే ప్రఖ్యాతి చెందిన ఏయూ పరువు రోజు రోజుకూ దిగజారుతోందని పలువురు ఆవేదన చెందుతున్నారు. ఏయూలో నిన్న జరిగిన ఓ కార్యక్రమానికి కలెక్టర్ హరేంధిర ప్రసాద్, CP శంఖబ్రత బాగ్చీ వచ్చారు. ఈ క్రమంలో ఓ విదేశీ విద్యార్థి వారి వద్దకు వెళ్లి తమ హాస్టల్లో కొంతమంది విద్యార్థులు మద్యం తాగాలంటూ బలవంతం చేస్తున్నారని ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని కమిటీ వేసి చర్యలు తీసుకుంటామని VC రాజశేఖర్ తెలిపారు.
Similar News
News March 11, 2026
ప.గో: అధిక ఆదాయంపై దృష్టి కేంద్రీకరించని అధికారులు

నరసాపురం <<19354659>>పంటు<<>> వేలంలో ఆసక్తి ఉన్న వారందరికీ అవకాశం కల్పిస్తే ప్రభుత్వ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. సొంత పంటు ఉన్నవారే వేలంలో పాల్గొనాలనే నిబంధనతో పోటీ తగ్గుతోందని, నీటిపారుదల, మండల పరిషత్ అధికారులు పునరాలోచించాలని కోరుతున్నారు. నిబంధనలు సడలించి పారదర్శకత పెంచడం ద్వారా ఖజానాకు భారీగా నిధులు సమకూరుతాయని, ఈ దిశగా యంత్రాంగం దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
News March 11, 2026
ప.గో: గతం కంటే తక్కువకు కట్టబెట్టే ప్రయత్నాలు

ఉమ్మడి ప.గో జిల్లాలో నరసాపురం – సఖినేటిపల్లి మధ్య ప్రయాణికులను చేరవేసే పంటు వేలం వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. గతేడాది ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.4.18 కోట్ల ఆదాయం సమకూరింది. తాజాగా సొంత పంటు ఉన్నవారు మాత్రమే పాటలో పాల్గొనాలనే నిబంధనను తీసుకొచ్చారు. దీనివల్ల పోటీ తగ్గి, ప్రస్తుత వేలం బిడ్ రూ.3.59 లక్షలుగా ఖరారైంది. తాజా పరిణామాలతో ప్రభుత్వ ఆదాయం గణనీయంగా తగ్గే అవకాశం కనిపిస్తోంది.
News March 11, 2026
కర్నూలు జిల్లా రైతులకు తీపి కబురు

అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం కింద 2025-26 ఆర్థిక సహాయం ఈ నెల 13న విడుదల కానుందని జేడీఏ వరలక్ష్మి తెలిపారు. అర్హత కలిగిన రైతులకు రూ.6,000 చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నామని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 2,72,757 మంది లబ్ధిదారులకు రూ.154.94 కోట్లు అందుతాయని జిల్లా వ్యవసాయ అధికారి వివరించారు. ఈ నిధులు డీబీటీ ద్వారా రైతుల ఖాతాలకు చేరుతాయి.


