News April 13, 2024
జహీరాబాద్: పల్లెల్లో ఎన్నికల సందడి.. పార్టీలపై చర్చ..!

పల్లెల్లో పార్లమెంట్ ఎన్నికల సందడి మొదలైంది. రచ్చబండ వేదికగా గ్రామాల్లోని పెద్దమనుషులు పార్టీల పనితీరు బేరీజు వేస్తూ ఓట్లు ఎవరికి వేయాలో చర్చించుకునే పనిలో పడ్డారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో చాలావరకు గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి. అందులో మేజర్ పంచాయతీలపై పార్టీల అభ్యర్థులు ఫోకస్ పెట్టారు. గ్రామాల్లోని ప్రజాప్రతినిధులను మచ్చిక చేసుకొని ఓట్లు రాబట్టుకునేందుకు ఇప్పటి నుంచే మంతనాలు చేస్తున్నారు.
Similar News
News March 10, 2026
మెదక్: మహిళ మృతదేహం కలకలం

పాపన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. మంగళవారం ఏడుపాయల వెళ్లే రహదారిలోని చెల్మికుంట అడవి ప్రాంతంలో గుర్తుతెలియని మహిళా మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతురాలని ఎవరైనా గుర్తిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
News March 10, 2026
సంక్షేమ శాఖ పనితీరు ఆదర్శనీయం: ఐసీడీఎస్ డైరెక్టర్

మెదక్ జిల్లాలో మహిళా, శిశు సంక్షేమ శాఖ పనితీరు ఆదర్శంగా ఉందని ఐసీడీఎస్ డైరెక్టర్ శృతి ఓజా ప్రశంసించారు. సోమవారం ఆమె మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ ప్రతిమ సింగ్‌తో భేటీ అయ్యారు. అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, జిల్లాలోని కేంద్రాలు, సఖి సెంటర్లలో బాధితులకు, చిన్నారులకు మెరుగైన సేవలు అందుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.