News November 19, 2025
కర్నూలు: రూ.3 లక్షల వేతనంతో ఉద్యోగాలు

ఈనెల 20న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా ఉపాధి కల్పన అధికారి పి.దీప్తి తెలిపారు. రిలయన్స్ కన్స్యూమర్ ప్రాడక్ట్స్ లిమిటెడ్ కోసం మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేటర్ పోస్టులు భర్తీ చేయనున్నారని పేర్కొన్నారు. డిప్లొమా/ఐటీఐ అర్హతతో 24 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఉద్యోగానికి ఎంపికైతే వార్షిక వేతనం రూ.3 లక్షలు ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు www.ncs.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు.
Similar News
News March 22, 2026
సిద్దిపేటకు సీఎం వరాలు ప్రకటించేనా?

సిద్దిపేట జిల్లా పర్యటనకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పైన జిల్లా ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నంగునూరు మండలం నర్మెట్టలో రైతు ఉత్సవాలు కార్యక్రమానికి సీఎం హాజరవుతున్న తరుణంలో నియోజకవర్గంలో ఆగిన అభివృద్ధి పనుల మోక్షానికి సీఎం నిధులు ప్రకటించే అవకాశం ఉందని చర్చ కొనసాగుతుంది. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన రూ.1,070 కోట్ల అభివృద్ధి పనులకు ఈ ప్రభుత్వం బ్రేక్ వేయడంతో పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
News March 22, 2026
కృష్ణా: మళ్లీ కిరోసిన్ ముచ్చట

ఉమ్మడి కృష్ణా జిల్లాలో 3 దశాబ్దాల క్రితం నిత్యావసరంగా ఉన్న కిరోసిన్.. మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. గ్యాస్, విద్యుత్ పొయ్యిల రాకతో ప్రభుత్వం కిరోసిన్ సరఫరా నిలిపివేసిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ యుద్ధాల కారణంగా గ్యాస్ కొరత ఏర్పడిందని, వచ్చే నెల నుంచి రేషన్ దుకాణాల్లో కిరోసిన్ పంపిణీ చేస్తారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ వార్తలపై అటు అధికారులు, ఇటు ప్రజల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
News March 22, 2026
లక్ష్యాన్ని మించి రబీ సాగు!

AP: మొంథా, దిత్వా తుఫాన్లతో భారీ వర్షాలు కురిసినా రబీ సాగుకు ఆటంకం కలగలేదు. ఈ సీజన్‌లో 20.79L హెక్టార్లలో 22 పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేయగా ఏకంగా 27.36L హెక్టార్లలో రైతులు పంటలు వేశారు. వరి, మొక్కజొన్న, శనగ, వేరుశనగ, అపరాలు, చిరు ధాన్యాలు, పొగాకు, నూనె గింజలను సాగు చేశారు. కృష్ణా, గోదావరి డెల్టాలతోపాటు నదులు, చెరువుల్లో నీరు పుష్కలంగా ఉండటంతోనే ఇది సాధ్యమైందని అధికారులు చెబుతున్నారు.


