News November 19, 2025
కర్నూలు: రూ.3 లక్షల వేతనంతో ఉద్యోగాలు

ఈనెల 20న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా ఉపాధి కల్పన అధికారి పి.దీప్తి తెలిపారు. రిలయన్స్ కన్స్యూమర్ ప్రాడక్ట్స్ లిమిటెడ్ కోసం మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేటర్ పోస్టులు భర్తీ చేయనున్నారని పేర్కొన్నారు. డిప్లొమా/ఐటీఐ అర్హతతో 24 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఉద్యోగానికి ఎంపికైతే వార్షిక వేతనం రూ.3 లక్షలు ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు www.ncs.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు.
Similar News
News April 6, 2026
తిరుపతి: లవర్స్ ఆత్మహత్య

త్వరలో పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన ఓ జంట వేరువేరు చోట్ల సూసైడ్ చేసుకుంది. కడప(D) సుండుపల్లి(M)నికి చెందిన అనిషా(18), అస్లాంకు ఏడాది కిందట.. ఈ జూన్‌లో పెళ్లి ఖాయం అయింది. అస్లాం తిరుపతిలో చదువుకొంటున్నాడు. అయితే భాగంపల్లెలో అనిషా ఉరి వేసుకోగా, <<19577457>>చంద్రగిరి<<>> పరిధిలో అస్లాం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News April 6, 2026
నెల్లూరు జిల్లాలో ధరల పెంపు

నెల్లూరు జిల్లాలో విజయ డెయిరీ పాల సేకరణ ధరలు పెరిగాయి. నేటి నుంచే అమలు చేస్తున్నామని డెయిరీ ఛైర్మన్ వెంకట ప్రసాద్ వెల్లడించారు. గేదె పాలకు కేజీ వెన్న శాతం గతంలో రూ.800 ఉండగా రూ.820కి పెంచామని చెప్పారు. రైతులకు లీటరు పాలపై అదనంగా రూ.1.28 అందుతుందన్నారు. ఆవు పాలకు గతంలో రూ.265 ఉండగా ఇప్పుడు రూ.290 చేశామని.. లీటరు ఆవు పాలపై రైతుకు అదనంగా రూ.3 చెల్లిస్తామని చెప్పారు.
News April 6, 2026
మార్కాపురం అటవీ శాఖలో ఉద్యోగాలు

మార్కాపురం అటవీ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ఆధ్వర్యంలో ఔట్సోర్సింగ్‌లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగానికి దరఖాస్తుల ఆహ్వానం పలికారు. మార్కాపురం జిల్లాలో పనిచేయుటకు ఏదైనా డిగ్రీ కలిగి, MS ఆఫీస్, టైప్ స్కిల్స్ కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. బీటెక్ చదివిన వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. దరఖాస్తులను ఏప్రిల్ 7వ తేదీలోపు సమర్పించాలన్నారు. మరిన్ని వివరాలకు మార్కాపురం అటవీ శాఖ కార్యాలయానికి రావాలన్నారు.


