News November 18, 2025
NLG: మహిళా సంఘాల పేరుతో రూ.1.50 కోట్లు స్వాహా

నల్గొండ పట్టణంలోని 3వ వార్డు పాతపల్లెకు చెందిన 12 సంఘాల పేరున ఆ గ్రామానికి చెందిన బుక్ కీపర్ ఒకరు బ్యాంకు ఫీల్డ్ అధికారులతో కలిసి కుమ్మక్కై కోటిన్నర రుణాలు తీసుకున్నారు. 4 నెలల నుంచి చెల్లింపులు ఆగడంతో బ్యాంకు సిబ్బంది బాధితుల దగ్గరికి వెళ్లగా.. తమకేం తెలవదని వారు ఆశ్చర్యానికి లోనయ్యారు. బుక్ కీపర్, బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బ్యాంకు ముందు నిరసన తెలిపారు.
Similar News
News November 18, 2025
త్వరలో అన్ని ఆసుపత్రులకు అల్ట్రా సౌండ్, ECG మెషీన్లు

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని హుస్నాబాద్, హుజురాబాద్, జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రులకు అల్ట్రా సౌండ్, ఈసీజీ మెషీన్ వంటి ముఖ్యమైన వైద్య పరికరాలను అందజేస్తానని కేంద్రమంత్రి బండి సంజయ్ వెల్లడించారు. వేములవాడ ఏరియా ఆసుపత్రికి రూ.కోటిన్నర విలువ చేసే వైద్య పరికరాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ.. కేంద్రం పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో ఉందన్నారు.

ప్రకాశం: అన్నదాత సుఖీభవ నగదు జమ.. ఎంతమంది అర్హులంటే?

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా రేపు రెండవ విడత అన్నదాత సుఖీభవ నగదు జమ కానున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖాధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 268165 మంది రైతులకు రూ.134 కోట్లు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా జమవుతుందని, అలాగే 21వ విడత పిఎం కిసాన్ పథకం నగదు రూ.231000 మంది రైతులకు రూ. 46.28 కోట్లు నగదు జమ కానుందన్నారు.