News November 19, 2025
మంచిర్యాల: ప్రయాణికుల కోసం దర్భాంగ ప్రత్యేక రైలు

ప్రయాణికుల సౌకర్యార్థం చర్లపల్లి-దర్భాంగ మధ్య ప్రత్యేక రైలు (07999)ను బుధవారం నడపనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ప్రత్యేక రైలు కాజీపేట మీదుగా ప్రయాణిస్తుంది. ఇది రామగుండం, మంచిర్యాల, చిల్పూర్, కాగజ్‌నగర్, బల్లార్ష, గోండియా, రాయపూర్, బిలాస్‌పూర్, రాంచి సహా పలు స్టేషన్లలో ఆగుతుంది. ఈ ప్రత్యేక రైలు సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
Similar News
News March 19, 2026
పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టిన లోకేశ్: హోంమంత్రి అనిత

వివిధ ప్రభుత్వ శాఖలలో 10,060 పోస్టుల భర్తీకి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్ శ్రీకారం చుట్టినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఏటా ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రిని ‘X’ వేదికగా అభినందించారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు. నిరుద్యోగ యువత ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలన్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
News March 19, 2026
అనకాపల్లి: పండగకు వచ్చి మేనకోడలిపై అత్యాచారం..!

అనకాపల్లి మండలంలోని ఓ గ్రామంలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రావణి తెలిపారు. గురువారం తన కార్యాలయంలో కేసుకు సంబంధించిన వివరాలను తెలిపారు. పండగకు వచ్చిన వ్యక్తి వరసకు మేనకోడలైన బాలికను డాబాపైకి తీసుకువెళ్లి అత్యాచారం చేయడంతో పాటు బెదిరించాడు. బాలిక విషయాన్ని తల్లికి చెప్పడంతో ఆమె ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు.
News March 19, 2026
పార్టీల పంచాంగం.. అందరికీ శుభయోగమే!

TG: కాంగ్రెస్, BRS, BJP కార్యాలయాల్లో జరిగిన పంచాంగ శ్రవణంలో పండితులు భవిష్యత్ అంతా తమకే అనుకూలంగా ఉందని ప్రధాన పార్టీలకు వివరించారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, రేవంత్ పాలనకు ఇబ్బంది లేదని గాంధీభవన్లో తెలిపారు. ప్రజల్లో అసంతృప్తి పెరిగి విపక్షానికి బలం పెరుగుతుందని BRS ఆఫీస్‌లో చెప్పగా.. ఈ ఏడాదీ కలిసివచ్చి దేశం, రాష్ట్రంలో BJP హవా ఉంటుందన్నారు. కవితకు ప్రజల మద్దతు పెరుగుతుందని చెప్పారు.


