News November 19, 2025

హోటల్‌ రూమ్‌లకు భలే డిమాండ్‌

image

శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలకు దేశ విదేశాల నుంచి వేలాది మంది భక్తులు భారీగా తరలివస్తుండటంతో పుట్టపర్తిలో లాడ్జిలకు డిమాండ్ పెరిగింది. రూ.5 వేలు పెట్టినా రూములు దొరకడం లేదు. అయితే, ట్రస్ట్ తరఫున 50 వేల మందికి సరిపడేలా వసతి షెడ్లు ఏర్పాటు చేసి, మూడు పూటలా భోజన సౌకర్యం కల్పించారు. రైల్వే స్టేషన్ నుంచి ప్రశాంతి నిలయానికి ఉతచి బస్సులు ఏర్పాటు చేశారు. దేవభూమి ఆధ్యాత్మక శోభతో వెలుగొందుతోంది.

Similar News

News March 22, 2026

టచ్ చేస్తే తగలబెట్టేస్తాం: ఇరాన్

image

తమ దేశంలోని పవర్ ప్లాంట్లపై అమెరికా దాడులు చేస్తే <<19449510>>హార్ముజ్ జలసంధిని<<>> పూర్తిగా మూసివేస్తామని ఇరాన్ మిలిటరీ నాయకత్వం స్పష్టం చేసింది. వాటిని పునర్నిర్మించే వరకు జలసంధిని ఓపెన్ చేయబోమని తేల్చి చెప్పింది. అలాగే అమెరికా సైనిక స్థావరాలు ఉన్న దేశాల్లోని పవర్ ప్లాంట్లను, ఇజ్రాయెల్‌లోని ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్లను నాశనం చేస్తామని వార్నింగ్ ఇచ్చింది.

News March 22, 2026

సొంత భూమికి సొమ్ము దక్కకనే వృద్ధుడి ఆత్మహత్య: ఎస్ఐ

image

భూమి అమ్మిన డబ్బులు ఇవ్వకుండా కొనుగోలుదారులు బెదిరింపులకు పాల్పడటంతో మనస్తాపం చెందిన <<19446112>>వృద్ధుడు<<>> ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఎర్రుపాలెం SI రమేష్ తెలిపారు. బనిగండ్లపాడుకు చెందిన యన్నం వెంకటరామిరెడ్డి(70) తనకు ఉన్న 3గుంటల ఖాళీ స్థలాన్ని ముగ్గురికి విక్రయించారు. వారు కొంత నగదు చెల్లించి, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మిగిలిన డబ్బుల కోసం వారిని అడగగా, భయభ్రాంతులకు గురిచేశారని ఎస్ఐ అన్నారు.

News March 22, 2026

రేపు విశాఖ రానున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈనెల 23న విశాఖ రానున్నారు. 23న మధ్యాహ్నం 2.30 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొని అక్కడి నుంచి నక్కపల్లి మండలం చందనాడ గ్రామానికి వెళ్తారు. చందనాడలో జరిగే స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో కలిసి ఆయన పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు విశాఖ నుంచి విజయవాడ బయలుదేరి వెళ్తారు.