News November 19, 2025

పటాన్‌చెరు: 290 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

image

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పటాన్‌చెరు పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం ఇస్నాపూర్ X రోడ్ వద్ద వాహన తనిఖీల్లో సివిల్ సప్లై డిప్యూటీ తహశీల్దార్ అనూప్ దేవానంద్‌తో కలిసి లారీని తనిఖీ చేశారు. లారీలో ప్రభుత్వ రేషన్ బియ్యం ఉన్నట్లు తేలింది. 290 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. లారీ యజమాని జయవీర్, డ్రైవర్ నారాబాయిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News March 21, 2026

తిరుమలలో అన్నప్రసాదం స్వీకరించిన సీఎం

image

తిరుమల శ్రీవారి దర్శనానంతరం CM చంద్రబాబు కుటుంబ సమేతంగా శ్రీ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి చేరుకున్నారు. స్వయంగా కుటుంబ సభ్యులే భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. అనంతరం అక్కడ భక్తులు, కుటుంబసభ్యులు సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు మంత్రి లోకేశ్, మనవడు దేవాన్ష్‌తో కలిసి సీఎం చంద్రబాబు అన్నప్రసాదం స్వీకరించారు.

News March 21, 2026

రాష్ట్రంలో నాన్‌వెజ్.. నాన్‌స్టాప్!

image

TG: రాష్ట్రంలో మాంసం ఉత్పత్తి భారీగా పెరిగినట్లు సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది. 2013-14లో 2.30 లక్షల టన్నులుగా ఉన్న ఉత్పత్తి, 2024-25 నాటికి 11.12 లక్షల టన్నులకు పెరిగినట్లు పేర్కొంది. 2019 లెక్కల ప్రకారం రాష్ట్రంలో 3.26 కోట్ల పశుసంపద ఉందని తెలిపింది. గొర్రెల సంఖ్యలో దేశంలోనే తొలి స్థానంలో, పౌల్ట్రీలో మూడో ప్లేస్‌లో నిలిచినట్లు చెప్పింది.

News March 21, 2026

KNR: గోదావరి పుణ్యక్షేత్రాలకు “పుష్కర కళ”

image

రాష్ట్ర బడ్జెట్‌లో గోదావరి పుష్కరాల కోసం రూ.500 కోట్లు కేటాయించిన నేపథ్యంలో, ఉమ్మడి KNR (D)లోని కాళేశ్వరం, ధర్మపురి, మంథని, కోటిలింగాలు, గోదావరిఖని, జనగామ, సుందిళ్ల, బీర్పూర్, చెగ్యం, వంటి పుష్కర ఘాట్లతో పాటు, దేవస్థానాల రూపురేఖలు సరికొత్త శోభను సంతరించుకోనున్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా, ఈ నిధులతో గోదావరి తీరాన్ని ఒక పర్యాటక కారిడార్‌లా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది.