News November 18, 2025
NTR వీరాభిమాని ఆగయ్యకు నేతల నివాళులు

TDP సీనియర్ నేత, NTR వీరాభిమాని కళ్యాడపు ఆగయ్య నిన్న మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో PDPL MLA చింతకుంట విజయరమణా రావు, సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కరీంనగర్‌లో ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. TDP ఆవిర్భావం నుంచి పనిచేసిన నేతగా ఆగయ్య పార్టీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారని, ఎన్టీఆర్ కుటుంబానికి అత్యంత ఆప్తుడిగా ఉన్నారని నేతలు అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Similar News
News November 18, 2025
ఫోన్ పోయిన వెంటనే ఫిర్యాదు చేయాలి: ASF ఎస్పీ

మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న వారు వెంటనే CEIR వెబ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని ASF జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ సూచించారు. మంగళవారం ASF ఎస్పీ కార్యాలయంలో సెయిర్ వెబ్ పోర్టల్ ద్వారా స్వాధీనం చేసుకున్న 41 మొబైల్ ఫోన్లను బాధితులకి అప్పగించారు. ప్రతి ఒక్కరికి మొబైల్ అనేది తప్పనిసరి వస్తువు అయిందన్నారు. ప్రతి చిన్న పనితో పాటు యూపీఐ లావాదేవీలకి సైతం మొబైల్ ప్రధానమన్నారు.

‘బాపట్ల జిల్లాలో రైతులకు రూ.26.98 కోట్ల ఆర్థిక సహాయం’

అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం రెండో విడత ఆర్థిక సహాయ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ అధికారులకు సూచించారు. ఈనెల 19న జరిగే ఈ కార్యక్రమాన్ని అన్ని స్థాయిలలో ఆధికారులు సమన్వయంతో నిర్వహించాలన్నారు. ప్రతి రైతు సేవా కేంద్రంలో ప్రసార ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జిల్లాలో 1.60 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.26.98 కోట్ల ఆర్థిక సహాయం జమ కానుందని తెలిపారు.