News April 13, 2024
ఈసారి ‘IPL’ బీజేపీదే: బండి సంజయ్

TG: ఈసారి ‘IPL’ (ఇండియన్ పొలిటికల్ లీగ్) కప్ తమదేనని కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ‘ఐపీఎల్‌తోపాటు ‘టీపీఎల్’ (తెలంగాణ ప్రీమియర్ లీగ్) కూడా మాదే. కాంగ్రెస్‌కు ప్లేయర్స్ కూడా దొరకడం లేదు. బీఆర్ఎస్‌కు ఆటగాళ్లున్నా ఫామ్‌లో లేరు. కిషన్‌రెడ్డి కెప్టెన్సీలో బీజేపీ టీమ్ దూసుకుపోతుంది. 17 సీట్లు సాధించి టీపీఎల్ కైవసం చేసుకుంటాం’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News January 25, 2026
అమెరికా దాడుల భయం.. అండర్‌గ్రౌండ్ బంకర్‌లోకి ఖమేనీ!

ఇరాన్ వైపు పెద్ద ఎత్తున <<18930505>>యుద్ధ నౌకలు<<>> వెళ్తున్నాయని ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టెహ్రాన్‌లోని అండర్‌గ్రౌండ్ బంకర్‌లోకి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ వెళ్లారని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. యుద్ధాల సమయంలో రక్షణ కోసం ఈ బంకర్ నిర్మించారని, ఒకదానితో ఒకటి అనుసంధానించిన సొరంగాలు ఉన్నాయని చెప్పింది. ఖమేనీ మూడో కొడుకు మసౌద్ ప్రభుత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారని పేర్కొంది.
News January 25, 2026
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కన్నుమూత

ఒడిశాకు చెందిన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ అభిజిత్ మజుందార్(54) కన్నుమూశారు. BP, లివర్ సంబంధిత అనారోగ్య కారణాలతో ఆయన భువనేశ్వర్‌లోని AIIMSలో ఇవాళ తుదిశ్వాస విడిచారు. 2000వ సంవత్సరంలో ఒడియా చిత్ర పరిశ్రమలోకి ఎంటరైన అభిజిత్ దాదాపు 3దశాబ్దాలుగా ఎన్నో చిత్రాలకు మ్యూజిక్ అందించారు. సుమారు 700 పాటలను కంపోజ్ చేశారు. ఆయన మృతిపట్ల CM మోహన్ చరణ్, మాజీ CM నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
News January 25, 2026
చిన్న స్టెప్.. పెద్ద లాభం!

ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యమా? అయితే టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు ఇచ్చే టైపింగ్ సర్టిఫికెట్ తప్పక పొందండి. టైపిస్ట్, స్టెనో, క్లర్క్స్ తదితర ఉద్యోగాలకు డిగ్రీలతో పాటు ఈ సర్టిఫికేషన్ తప్పనిసరి. మనకు సూపర్ ఫాస్ట్ టైపింగ్ స్కిల్స్ ఉన్నా, వాటిని గుర్తించేలా ధ్రువీకరణ పత్రం కావాలి. కాబట్టి తక్కువ సమయమే పట్టే ఈ చిన్న మైల్‌స్టోన్ మీ క్వాలిఫికేషన్స్ లిస్ట్‌లో చేరితే ఎక్కువ జాబ్ ఆప్షన్స్ ఉంటాయి.
Share It


